Sputnik v vaccine: మరో మూడ్రోజుల్లో ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్, ఇవీ ప్రత్యేకతలు

Sputnik v vaccine: ఇండియాకు మరో వ్యాక్సిన్ వస్తోంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పంపిణీకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మార్కెట్ చేయబోతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 28, 2021, 04:49 PM IST
Sputnik v vaccine: మరో మూడ్రోజుల్లో ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్, ఇవీ ప్రత్యేకతలు

Sputnik v vaccine: ఇండియాకు మరో వ్యాక్సిన్ వస్తోంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పంపిణీకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మార్కెట్ చేయబోతోంది.

ఇండియాలో ఇప్పటికే కోవ్యాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ (Covishield vaccine)లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరో వ్యాక్సిన్ రానుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మరో మూడ్రోజుల్లో దేశంలో పంపిణీ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ( Dr Reddys labs) పూర్తి చేసింది. రష్యాలోని గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఇందులో 91.6 శాతం సామర్ధ్యం కలిగి ఉందని తేలింది. ఇప్పటికే రష్యాలో 3.8 మిలియన్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని..97.6 శాతం కరోనా వ్యాప్తిని అడ్డుకుంటోందని రష్యా ఆరోగ్య శాఖ తెలిపింది. ఏప్రిల్ 12వ తేదీన ఈ వ్యాక్సిన్‌కు ఇండియాలో డీసీజీఐ (DCGI) అనుమతిచ్చింది.

ఇతర వ్యాక్సిన్‌లకు విభిన్నం

స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ( Sputnik v vaccine) ఇతర వ్యాక్సిన్‌లకు భిన్నంగా ఉంటుంది. ఇతర సంస్థల వ్యాక్సిన్ రెండు డోసులు ఒకేలా ఉంటే..స్పుత్నిక్ వి డోసులు మాత్రం ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఇందులో ఒక డోసు కరోనా వైరస్ కారణమయ్యే సార్స్ కోవిడ్-2 స్పైక్ ప్రోటీన్‌ను అడ్డుకుంటే..రెండవ డోసు మాత్రం వైరస్ సంక్రమణను అడ్డుకుంటుంది. ధర కూడా మిగిలిన వ్యాక్సిన్ల కంటే కాస్త ఎక్కువే ఉంటుంది. స్పుత్నిక్ వి కు పోటీగా ఉన్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (AstraZeneca vaccine) ఒక్క డోసు ఖరీదు 4 డాలర్లు అయితే..స్పుత్నిక్ వి ధర 10 డాలర్లు ఉంది. ఇండియాలో మాత్రం వ్యాక్సిన్ ధర పది డాలర్ల కంటే తక్కువే ఉంటుందని రష్యా ఇప్పటికే ప్రకటించింది. 850 మిలియన్ లేదా 85 కోట్ల డోసుల ఉత్పత్తికి ఇండియాకు చెందిన 5 కంపెనీలతో ఒప్పందమైంది. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.

Also read: Covid Virus Spread: ఆ రెండు వ్యాక్సిన్‌లలో ఒక్క డోసు పడినా చాలు..సంక్రమణ తగ్గుతోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News