Cotton Candy: అమ్మబాబోయ్.. పీచు మిఠాయి తయారీలో దీన్ని ఉపయోగిస్తారా..?.. దేశ వ్యాప్తంగా చర్చలో నిలిచిన ఘటన..

Tamilnadu: మనలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాక పీచు మిఠాయిలను ఎంతో ఇష్టంగా తింటారు. చూడటానికి పెద్దగా కాటన్ తో తయారు చేయబడి పింక్ రంగులో ఉంటుంది. కానీ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 18, 2024, 12:21 PM IST
  • - పీచు మిఠాయి తయారీలో కెమికల్స్..
    - ల్యాబ్ టెస్ట్ లలో బైటపడ్డ షాకింగ్ విషయాలు..
Cotton Candy: అమ్మబాబోయ్.. పీచు మిఠాయి తయారీలో దీన్ని ఉపయోగిస్తారా..?.. దేశ వ్యాప్తంగా చర్చలో నిలిచిన ఘటన..

Ban On Ctoon Candy Sales In Tamilnadu: మనం ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో కలిసి ఎగ్జిబిషన్ లకు వెళ్తుంటాం. అక్కడ చిన్నపిల్లలకు ఇష్టమైనవన్ని ఉంటాయి. ముఖ్యంగా అక్కడ పీచుమిఠాయిలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పింక్ రంగులో ఉండి ప్రత్యేకంగా ఒక పుల్లకు పెద్దగా ఉన్న కాటన్ తయారు చేసిన పీచు మిఠాయిని అమ్ముతుంటారు దీన్ని అందరు కొనితింటుంటారు. ఇక.. మాల్స్ లలో కూడా వీటిని విక్రయిస్తున్నారు. ఊర్లలో లేదా మన ఇంటి దగ్గర సైకిల్ మీద వచ్చి పీచు మిఠాయిలను అమ్ముతుంటారు. అయితే.. పీచుమిఠాయిల విక్రయాలపై తాజాగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది.

Read More: Shivatmika Rajasekhar: గ్లామర్ డోస్ పెంచిన శివాత్మిక రాజశేఖర్.. సెగలు రేపుతున్న లేటెస్ట్ పిక్స్..

తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయి (కాటన్ క్యాండీ) విక్రయాలపై నిషేధం విధించింది. వీటిలో క్యాన్సర్ ను కల్గించే కారకాలు ఉన్నట్లు పరిశోధనల్లో తెలిందని ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సుబ్రమణియన్ వెల్లడించారు. ఇటీవల పీచు మిఠాయిల నాణ్యతను టెస్ట్ చేయడానికి ఫుడ్ సెఫ్టీ అధికారులు చెన్నైలో తనిఖీలు చేపట్టారు. కొన్ని నమునాలు తీసుకుని ల్యాబ్ లో పంపించి అధ్యయనం చేయగా.. కాటన్ క్యాండీ తయారీలో రోడమైన్ బి అనే కెమికల్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఆర్టిఫిషియల్ గా రంగులు రావడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ కెమికల్ ను బట్టలు రంగులు, పేపర్ ప్రింటింగ్ లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాంటి కెమికల్ ను కాటన్ క్యాండీలో వాడుతున్నారని తెలిసి అధికారులు ఖంగుతిన్నారు. దీని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్త అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Read More: Haircare Tips: ఒత్తైన మందపాటి జుట్టు కావాలా? షహనాజ్ హుస్సేన్ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి..

దీన్ని ఎక్కువగా తింటే.. కిడ్నీలు, లివర్ పనితీరుపై కూడా ఎఫెక్ట్ చూయిస్తుందని, నోటి అల్సర్, క్యాన్సర్ కు కూడా దారితీసే ప్రమాదం లేకపోలేదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలోనే పీచు మిఠాయిలపై నిషేధం విధించినట్లు తమిళనాడు గవర్నమెంట్ తెలిపింది. కాగా, ఇప్పటికే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాటన్ క్యాండీపై నిషేధం అమలు చేస్తున్నారు. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News