Sanatan Row: సనాతనంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన స్టాలిన్, ద్రౌపది ముర్ముని పిలవకపోవడమే సనాతనమా

Sanatan Row: సనాతనంపై దుమారం ఇంకా చల్లారలేదు. రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయనిధి స్టాలిన్ తలకు నజరానా ప్రకటించినా తగ్గేది లేదంటున్నారు. ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ సనాతనంపై మరోసారి స్పష్టత ఇచ్చారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 6, 2023, 01:59 PM IST
Sanatan Row: సనాతనంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన స్టాలిన్, ద్రౌపది ముర్ముని పిలవకపోవడమే సనాతనమా

Sanatan Row: తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాన్ని రేపుతున్నాయి. అయోధ్యకు చెందిన ఓ సన్యాసి అయితే స్టాలిన్ తల నరికి తెస్తే 10 కోట్లు ఇస్తానని కూడా ప్రకటించాడు. అటు ఉదయనిది కూడా ఇలాంటి బెదిరింపులు చాలా చూశామన్నారు. 

సనాతనంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని బీజేపీ అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇది మొత్తం హిందూమతంపై దాడిగా అభివర్ణిస్తూ ఆరోపణలు సంధిస్తోంది. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మమని..ఈ వ్యాఖ్యల ద్వారా ఉదయనిధి స్టాలిన్ హిందూమతంపై దాడికి దిగారని ఆరోపిస్తోంది. అటు ఈ అంశంపై ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పష్టత ఇచ్చారు.  సనాతనం అంటే అందరికీ సమానంగా చూడటమని..కానీ ఇప్పుడున్నవారెవరకి ఆ ఆలోచన లేదని స్టాలిన్ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పష్టత ఇచ్చారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పిలవకపోవడమే సనాతన ధర్మమా అని ప్రస్తావించారు. తాను చెప్పేది ఇలాంటి సనాతనం గురించేనని వివరించారు. 

అదే సమయంలో డీఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిలోని పార్లీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని పార్టీలు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని సమర్ధిస్తుంటే మరి కొన్ని పార్టీలు సంయమనం పాటించాలని ఉదయనిధి స్టాలిన్‌కు సూచిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ అంశంపై స్పందించారు. తమిళనాడు ప్రజలంటే తనకు చాలా గౌరవమని..అదే సమయంలో ప్రతి మతానికి భిన్నమైన మనోభావాలుంటాయని వారికి వినయపూర్వకంగా అభ్యర్ధిస్తున్నానని చెప్పారు. ఇలాంటి అంశాల్లో జోక్యం చేసుకోకూడదని, ఏ వర్గానికైనా సరే ఇది బాధించే అంశమన్నారు. బహుశా ఈ విషయం అతనికి తెలియకపోవచ్చని, భారతదేశం మూలమే భిన్నత్వంలో ఏకత్వమైనందున తాను సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. 

ఎప్పుడూ ఒకరిని బాధపెట్టే వ్యాఖ్యలు చేయకూడదని మమతా సూచించారు. మరోవైపు ఇదే అంశంపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సైతం స్పందించారు. సమానత్వాన్ని ప్రోత్సహించని లేదా మానవుడిగా మీకు గౌరవం ఇవ్వని మతం తన దృష్టిలో మతమే కాదన్నారు. సమాన హక్కుల్ని ప్రోత్సహించని ఏ మతమైనా, మనిషిని మనిషిగా ట్రీట్ చేయని  మతం ఎదైనా రోగం లాంటిదేనన్నారు.

Also read: India vs Bharat Row: ఇండియా పేరు భారత్‌గా మారనుందా, అంతా పుకారేనా, కేంద్ర మంత్రి ఏమంటున్నారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News