భారత్‌లో రెండు కరోనా పాజిటివ్ కేసులు

ప్రపంచాన్ని గజ గజా వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్‌లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ అనుమానిత కేసులు ఉండగా.. తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఒక్కో కేసు నమోదైంది.

Last Updated : Mar 2, 2020, 04:39 PM IST
భారత్‌లో రెండు కరోనా పాజిటివ్ కేసులు

ప్రపంచాన్ని గజ గజా వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్‌లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ అనుమానిత కేసులు ఉండగా.. తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఒక్కో కేసు నమోదైంది. 

భారత్ లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో ఒక వ్యక్తి ఇటలీ నుంచి ఢిల్లీకి రాగా.. మరోక వ్యక్తి దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లుగా తెలిపింది. వారిద్దరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. నిజానికి ఆదివారం రోజున దుబాయ్ నుంచి మొత్తం ఐదుగురు హైదరాబాద్ వచ్చారు. వారిలో నలుగురికి కరోనా వైరస్ లేదని తేలింది. ఒక వ్యక్తికి మాత్రం పాజిటివ్‌గా పరీక్షల్లో తేలింది. పాజిటివ్ కేసు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేకంగా వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Read Also: కరోనా ఎఫెక్ట్: కొత్త తరహా పలకరింపు

ఇప్పటి వరకు విదేశాల నుంచి మొత్తం 1671 మంది భారత దేశానికి తిరిగి వచ్చారు. వారిలో ముగ్గురికి  మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిని ఇప్పుడు ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్ లక్షణాలు ఉండడంతో వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు 88 వేల మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఇప్పటికే 3 వేల మంది మృతి చెందారు. మొత్తం 60 దేశాల ప్రజలు గజ గజా వణుకుతున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News