Union Budget 2021 Live Updates: నేడు కీలక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న Nirmala Sitharaman

Union Budget 2021 Live Updates: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన మూడో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కోట్లాది భారతీయులు కేంద్ర బడ్జెట్ 2021పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 1, 2021, 12:22 PM IST
  • వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో పెద్ద ప్రకటన ఉంటుందని అంచనా
  • కరోనా వైరస్ తరువాత ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కావడంతో దేశ వ్యాప్తంగా ఆసక్తి
  • నేడు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Union Budget 2021 Live Updates: నేడు కీలక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న Nirmala Sitharaman

Union Budget 2021 Live Updates: కరోనా వైరస్ తరువాత ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కావడంతో దేశ వ్యాప్తంగా నేటి బడ్జెట్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపింది మాంద్యం దిశగా తీసుకెళ్లింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం (ఫిబ్రవరి 1న) లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దేశమంతా తాజా బడ్జెట్‌పై ఆసక్తికగా ఎదురుచూస్తోంది.

నేటి (ఫిబ్రవరి 1, 2021న) ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశానికి ముందు భారత ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ శుక్రవారం ఆర్థిక సర్వేను సమర్పించారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న మూడో బడ్జెట్ ఇది. కరోనా వైరస్ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు. కేంద్ర బడ్జెట్ 2021(Budget 2021 Latest Updates)లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అనేక సవాళ్లను ఎదుర్కోనున్నారు.

Also Read: New Rules from February 2021: ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త నియమాలు, రూల్స్

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన మూడో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మోదీ తొలిసారి అధికారం చేపట్టడానికి ముందుగా ఫిబ్రవరి చివరి దినానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. కాగా, మోదీ(Narendra Modi) గత ప్రభుత్వం నుండి ఫిబ్రవరి మొదటి పని దినాన కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు.

బడ్జెట్ సెషన్ 2021 లైవ్..
ఫిబ్రవరి 1, 2021 సోమవారం 11 గంటలకు బడ్జెట్ సెషన్ 2021(Budget 2021 Live Session)ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. జీ న్యూస్ వంటి పలు జాతీయ మీడియా ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. కొన్ని ప్రభుత్వ అధికారిక ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో బడ్జెట్ 2021 లైవ్ సెషన్‌ను చూడవచ్చు.

Also Read: Budget 2021 Live Updates: రాష్ట్రపతి Ram Nath Kovind బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

చరిత్రలో తొలిసారిగా..
కరోనా మహమ్మారి నేపథ్యంలో తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌ను కాగిత రహితం(Paperless Budget 2021)గా ప్రవేశపెట్టనున్నారు. ఇది చారిత్రాత్మక చర్య, ఎందుకంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి బడ్జెట్ పత్రాలు ముద్రించలేదు. కోవిడ్19 కారణంగా బడ్జెట్ పత్రాలను ముద్రించకూడదని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించడం తెలిసిందే.

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆధ్వర్యంలో బడ్జెట్ సమర్పణలో సంప్రదాయంలో మార్పు రావడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, ఆమె బడ్జెట్ పత్రాలను బ్రీఫ్‌కేస్‌లో తీసుకువెళ్లే సంప్రదాయానికి స్వస్తి పలికారు. పత్రాలను మరోసారి ఎరుపు వస్త్రంలో తీసుకొచ్చి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News