Budget 2021 Live Updates: రాష్ట్రపతి Ram Nath Kovind బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

Highlights Of President Ram Nath Kovind Budget 2021 Speech: భారతదేశ చరిత్రలో ఇవాళ ఎంతో ప్రత్యేకమన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ప్రభావితమయ్యారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కరోనా సంక్షోభాన్ని భారతదేశం పూర్తి శక్తిసామర్థ్యాలతో ఎదుర్కొందన్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 29, 2021, 02:23 PM IST
  • గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఘటనలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు
  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వంటి నేతలు కరోనాతో మరణించారని విచారం వ్యక్తం చేశారు
  • రూ.20 వేల కోట్ల ప్రత్యేక నిధి, ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు చేయూత
Budget 2021 Live Updates: రాష్ట్రపతి Ram Nath Kovind బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

Budget 2021 Live Updates: గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఘటనలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు. ఎర్రకోట ముట్టడి ఘటన దురదృష్టకరమని, దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతలను ఆషామాషీగా తీసుకోవద్దని రాష్ట్రపతి  కోవింద్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ మహమ్మారి(CoronaVirus) ఎందరో మహనీయులను బలితీసుకుందని, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వంటి నేతలు కరోనాతో మరణించారని విచారం వ్యక్తం చేశారు.

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు నేడు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(President Ram Nath Kovind) ప్రసంగంతో మొదలయ్యాయి. భారతదేశ చరిత్రలో ఇవాళ ఎంతో ప్రత్యేకమన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ప్రభావితమయ్యారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కరోనా సంక్షోభాన్ని భారతదేశం పూర్తి శక్తిసామర్థ్యాలతో ఎదుర్కొందన్నారు. భారత్ అభివృద్ధి ప్రస్థానాన్ని ఏ సవాల్ కూడా అడ్డుకోలేదని అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్‌లో ఎంఎస్ఎంఈల పాత్ర ఎంతో కీలకమైందన్నారు.

Also Read: WhatsApp Chat: మీ వాట్సాప్ ఛాటింగ్ డేటాను Telegram Appకు ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బడ్జెట్ 2021(Budget 2021 Latest Updates) ప్రసంగంలోని ముఖ్యాంశాలు: (Key Points Of President Ram Nath Kovind Budget Speech)
- గణతంత్ర దినోత్సవం, జాతీయ పతాకానికి కొన్ని రోజులుగా అవమానాలు ఎదురవుతున్నాయి
- భావవ్యక్తీకరణ స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగం చట్టాలు, నిబంధనలు పాటించాలని కూడా చెబుతోంది
- ఆత్మనిర్భర్ భారత్‌లో ఎంఎస్ఎంఈల పాత్ర ఎంతో కీలకమైంది
- రూ.20 వేల కోట్ల ప్రత్యేక నిధి, ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు చేయూత. 

Also Read: ఎల్‌టీసీ అలవెన్స్‌ చెల్లింపులపై 7వ వేతరణ సంఘం గుడ్ న్యూస్

- దేశంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించే కార్యక్రమం వేగంగా సాగుతోంది
- వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి 
- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాగు చట్టాలపై ప్రభుత్వ నిర్ణయాలు
- మత్స్యకారుల కోసం రానున్న ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు వ్యయం.

Also Read: International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగించిన DGCA
 

- దేశవ్యాప్తంగా 24 వేల ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఆయుష్మాన్ భారత్ సేవలు పొందొచ్చు 
 - జన ఔషధి పరియోజన్ ద్వారా దేశవ్యాప్తంగా 7 వేల కేంద్రాల్లో పేదలకు చౌక ధరల్లో ఔషధాలు. 
 - దేశ రైతుల ప్రయోజనానికి 3 సాగు చట్టాలను తీసుకొచ్చాం
 - స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచుతోంది. 
 - రైతుల సంక్షేమం కోసమే నూతన సాగు చట్టాలను తీసుకొచ్చింది. 

- దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా పెరిగాయి
 - కిసాన్ సమ్మాన్ నిధి(Kisan Samman Nishi Scheme Latest News) ద్వారా రైతుల ఖాతాల్లోకి లక్షా 13 వేల కోట్లు బదిలీ చేశాం
 - చిన్న, సన్నకారు రైతులపై మరింత శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది 
- సంక్షోభం సమయంలో పొరుగు దేశాలతో భారత్ కలసి సాగుతోంది
 - అనేక దేశాలకు లక్షల కొద్ది వ్యాక్సిన్ డోసులు పంపించాం
 - దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపాం

Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు, రూ.4700 పతనమైన Silver Price

- దేశ పౌరులందరి జీవన స్థితిగతుల ఉన్నతికి ఆత్మనిర్భర్ భారత్‌తో బాటలు
 - ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది
 - రెండు వ్యాక్సిన్లను కూడా దేశంలోనే రూపొందించారు
- కరోనాపై భారతదేశం పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం
 - సమయానుకూల చర్యలతో కరోనాను సమర్థంగా కట్టడి చేయగలిగాం.
 - ఈ పార్లమెంట్ సమావేశాలు భారతదేశానికి ఎంతో కీలకం.

Also Read: SBI MF Retirement Benefit Scheme: మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ప్రారంభించిన SBI 

 - దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి
 - తుపాన్ల నుంచి బర్డ్ ‌ఫ్లూ(Bird Flu Latest Updates) వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది
 - ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొంది
- కరోనా మహమ్మారి ఎంతోమంది విలువైన ప్రాణాలను బలి తీసుకుంది
 - కరోనా తర్వాత కొత్త సామర్థ్యంతో భారత్‌ ప్రపంచం ముందు శక్తిమంతమైన దేశంగా నిలిచిందని తన ప్రసంగంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తావించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News