Harsimrat Kaur Badal: కేంద్ర మహిళా మంత్రి రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం

పార్లమెంటులో ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లును వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ భాగస్వామ్య శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ (Harsimrat Kaur Badal) రాజీనామా చేశారు. సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆమె గురువారం రాత్రి రాజీనామా చేశారు.

Last Updated : Sep 18, 2020, 11:19 AM IST
Harsimrat Kaur Badal: కేంద్ర మహిళా మంత్రి రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం

President accepts Harsimrat Kaur Badal resignation: న్యూఢిల్లీ: పార్లమెంటులో ఎన్డీయే (NDA) సర్కారు ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లును వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ భాగస్వామ్య శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ (Harsimrat Kaur Badal) రాజీనామా చేశారు. సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆమె గురువారం రాత్రి రాజీనామా చేశారు. ఈ మేరకు హర్‌సిమ్రత్ కౌర్ తన రాజీనామాను ప్రధాని మోదీ కార్యాలయంలో సమర్పించారు. అనంతరం ఆమె రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ (Ram Nath Kovind) శుక్రవారం ఉదయం ఆమోదించారు. ప్రస్తుతం ఆ మంత్రిత్వశాఖ బాధ్యతలను మరో కేంద్ర మంత్రి అయిన నరేంద్ర సింగ్‌ తోమర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.  Also read: Ashok Gasti: కరోనాతో నూతన ఎంపీ కన్నుమూత

రైతులు, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులకు చెందిన కీలక బిల్లులను పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే.. వీటిలో అనేక అంశాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, దీంతో వ్యవసాయ రంగం తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని ఏన్డీయే భాగస్వామ్యంలో ఉన్న పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్‌ ఈ బిల్లులను వ్యతిరేకించింది. దీనికి నిరసనగా.. పదవుల నుంచి వైదొలగాలని అకాలీదళ్ నిర్ణయించుకుంది. ఈ బిల్లులకు నిరసనగా.. రైతు బిడ్డగా.. రైతుల సోదరిగా వారికి అండగా నిలుస్తూ.. పదవి నుంచి తప్పుకుంటున్నందుకు గర్వంగా ఉందంటూ ఈ మేరకు హర్‌సిమ్రత్ కౌత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. Also read: Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం

ఇదిలాఉంటే..  లోక్‌సభలో వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో కూడా అకాలీదళ్‌ అధ్యక్షుడు, హర్‌సిమ్రత్‌ భర్త ఎంపీ సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ కూడా కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించారు. అయితే.. విపక్షాల నుంచి, భాగస్వామ్య పార్టీ నుంచి ఈ వ్యవసాయ సంబంధిత బిల్లులపై వ్యతిరేకత వచ్చినప్పటికీ.. లోక్‌సభలో వాటిని కేంద్ర ప్రభుత్వం మూజువాణీ ఓటుతో ఆమోదింపజేసింది. Virat Kohli: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ‘టాప్’ లేపిన విరాట్ కోహ్లీ

Trending News