Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ (COVID-19 vaccine) కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఉమశమనం కలిగించేలా శుభవార్తను వెల్లడించింది. 

Last Updated : Sep 17, 2020, 06:16 PM IST
Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం

COVID-19 vaccine available in India beginning of 2021: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ (COVID-19 vaccine) కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఉమశమనం కలిగించేలా శుభవార్తను వెల్లడించింది. ఈ మేరకు గురువారం పార్లమెంట్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ (Health Minister Harsh Vardhan) కీలక ప్రకటన చేశారు. భారత్‌లో వచ్చే ఏడాది (2021) ప్రారంభంలో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టంచేశారు. ఇతర దేశాల మాదిరిగానే భారత్‌ కూడా కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రయత్నాల్లో నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే.. మూడు దేశీయ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ల ట్రయల్స్ ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని హర్షవర్ధన్ వివరించారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో నిపుణుల బృందం ఈ ప్రక్రియను పర‍్యవేక్షిస్తోందని, వచ్చే ఏడాది ప్రారంభం కల్లా అందుబాటులోకి వస్తుందని హర్షవర్ధన్ రాజ్యసభలో పేర్కొన్నారు. Also read: Sputnik-V vaccine : ఆర్‌డీఐఎఫ్‌తో డా. రెడ్డీస్ ఒప్పందం.. భారత్‌లో ‘స్పూత్నిక్ వీ’ ట్రయల్స్

అయితే.. దేశంలో జైడస్‌ క్యాడిలా (Zydus Cadila), భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కరోనావైరస్‌ నివారణ వ్యాక్సిన్‌లు రెండూ తొలి దశ పరీక్షలను పూర్తి చేసుకున్నాయి. దీంతోపాటు డీసీజీఐ అనుమతి లభించిన వెంటనే ఆస్ట్రాజనెకా, ఆక్స్‌ఫర్డ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII) రెండు, మూడో దశ ట్రయల్స్ చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. Also read: Covid19 vaccine: అమెరికన్ కంపెనీ నోవావాక్స్ తో సీరమ్ ఒప్పందం

ఇదిలాఉంటే.. ప్రపంచంలో తొలి వ్యాక్సిన్‌గా రిజిస్ట్రేషన్ అయిన రష్యా స్పూత్నిక్ వీ (Sputnik V ) వ్యాక్సిన్ ట్రయల్స్ కూడా భారతదేశంలో చేపట్టనున్నారు. ఈ మేరకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF), హైదరాబాద్‌కు చెందిన ఫార్మ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ మధ్య భారతదేశంలో స్పూత్నిక్ వీ క్లినికల్ ట్రయల్స్, సరఫరాకు ఒప్పందం సైతం జరిగింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను రాష్యాకు చెందిన గమలేయ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఆగస్టు 11 న అభివృద్ధి చేసింది. Also read: Ashok Gasti: కరోనాతో మరో ఎంపీ కన్నుమూత

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x