LPG Cylinder Price: వామ్మో.. రూ. 2000 చేరనున్న ఎల్పీజీ సిలిండర్ ధరలు... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం..

West Bengal: దేశంలో అనేక చోట్ల నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. నిత్యవాసరాల సరుకుల నుంచి కూరగాయల వరకు అన్ని ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే సిలెండర్ ధరలు తొందరలోనే  రూ. 2000 చేరవచ్చని ఏకంగా సీఎం వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 1, 2024, 01:42 PM IST
  • దేశంలో చుక్కలు చూపిస్తున్న నిత్యవసరాల ధరలు..
  • ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ బకాయిలపై సీఎం కీలక వ్యాఖ్యలు..
LPG Cylinder Price: వామ్మో.. రూ.  2000 చేరనున్న ఎల్పీజీ సిలిండర్ ధరలు... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం..

CM Mamata Banarjees Commets Over LPG Cylinder Price: ప్రస్తుతం దేశంలో లోకసభ ఎన్నికల రచ్చ నడుస్తోంది. ఇటు మరోసారి అధికారంసాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుంది. మరోవైపు ఇండియా కూటమి తాము ఇప్పుడైన అధికంగా సీట్లు గెలవాలని కలలు తనదైన స్టైల్ లో ప్రచారం చేస్తోంది. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, భారత్ జోడో న్యాయ యాత్రలో బీజేపీని విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. ఇక మరికొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుందని చెప్పుకొవచ్చు.

Read More: Raashii Khanna: రాశి ఖన్నా నెవ్వర్ బిఫోర్ హాట్ షో.. గులాబీ రంగు డ్రెస్స్ లో ఏముంది భయ్యా..

ఈ క్రమంలోనే వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్ జిల్లాలో గురువారం జరిగిన ఒక సభలో మమతా బెనర్జీ  ప్రసంగిస్తూ... బిజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎల్‌పీజీ సిలిండర్ ధరలు రూ.2000కు పెరగవచ్చని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలను తీవ్రం చేసుకున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2000 వరకు పెరగవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలను హెచ్చరించారు. అంతే కాకుండా.. ఇక మనం కిచెన్ లో వంటలను చేసుకొవడానికి తిరిగి అడవికి వెళ్లి కలవపు తెచ్చుకునే పరిస్థితి వస్తుందని ఆమె సెటైర్ వేశారు.

 కేంద్ర ప్రభుత్వం పేదలకు.. ఆవాస్ యోజన కింద రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని ఏప్రిల్‌లోగా పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటి నిర్మాణాన్ని ప్రారంభిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత ప్రకటించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ బకాయిలు చెల్లించలేదని ఆమె అన్నారు.

“100 రోజుల పని పథకానికి డబ్బు వచ్చిందా అని నేను ఒక యువకుడిని అడిగాను. తనకు దాదాపు ₹30,000 వచ్చినట్లు చెప్పాడు. గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తనలాంటి వారికి చెల్లించని మొత్తం ఇదని చెప్పుకొచ్చారు. కానీ తమ ప్రభుత్వం..  59 లక్షల మందికి బకాయిలు చెల్లించిందని సీఎం బెనర్జీ తెలిపారు.

ఇదిలా ఉండగా.. టీఎంసీకి చెందిన సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిగా కేసు నమోదైంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన షాజహాన్ షేక్‌ను టీఎంసీ సస్పెండ్ చేసినట్లు సమాచారం. దీనిపై బీజేపీ పార్టీ,  TMC ప్రస్తుతం పరస్పరం దాడి చేసుకుంటున్నాయి.

సందేశ్‌ ఖాళీ అరెస్టుపై స్పందించిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ స్పందించారు. వెస్ట్ బెంగాల్ లో.. ఇక  హింసాకాండకు ముగింపు పలకాలన్నారు. బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో గూండాలు రాజ్యమేలుతున్నారు. దీనికి ముగింపు పలికి,  గూండాలను కటకటాల వెనక్కి నెట్టాలని ఆయన అన్నారు.

Read More: Jaggery Tea: బెల్లం టీ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మహిళలు కచ్చితంగా ఇదే తీసుకుంటారు!

షాజహాన్‌ షేక్‌ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది. తమ పార్టీ నేతలు ఎవరైన తప్పులు చేస్తే వదిలేది లేదని టీఎంసీ తెల్చిచెప్పింది. అయితే.. బీజేపీలో కూడా కొందరు ఇలాంటి అవినీతి పరున్నారని, వాళ్లపై చర్యలు తీసుకునే దమ్ముందా అంటూ టీఎంసీ నేతలు సవాల్ విసిరారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News