BJP MP Controversial Comments:మా నేతను అడ్డుకుంటే కళ్లు పీకేస్తా.. చేతులు నరికేస్తానంటూ వార్నింగ్

బీజేపీ నేత మనీష్ గ్రోవర్‌ను ఎవరైనా అడ్డుకుంటే.. వారి కళ్లు పీకేస్తా... చేతులు నరికేస్తా... అంటూ ఆ పార్టీ ఎంపీ అరవింద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 07:30 PM IST
  • రైతు నిరసనలపై ఆగ్రహంతో బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
  • కళ్లు పీకేస్తా.. చేతులు నరికేస్తా అంటూ వార్నింగ్
  • ఎంపీ వ్యాఖ్యలకు బీజేపీ శ్రేణుల చప్పట్లు,కేకలు
  • హర్యానాలో బీజేపీ నేతలకు తరచూ రైతుల నిరసన సెగ
BJP MP Controversial Comments:మా నేతను అడ్డుకుంటే కళ్లు పీకేస్తా.. చేతులు నరికేస్తానంటూ వార్నింగ్

BJP MP Arvind Sharma Controversial Comments: హర్యానాలో రైతుల నుంచి తరచూ ఎదురవుతున్న నిరసనలు బీజేపీ (BJP) నేతలకు మంట పుట్టిస్తున్నాయి. రైతులపై ఆగ్రహంతో తాజాగా బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ (MP Arvind Sharma) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి మనీష్ గ్రోవర్‌ను రైతులు 8 గంటల పాటు నిర్బంధించిన ఘటనపై అరవింద్ శర్మ తీవ్ర స్థాయిలో స్పందించారు. 'మనీష్ గ్రోవర్‌ను ఎవరైనా అడ్డుకుంటే.. వారి కళ్లు పీకేస్తా... చేతులు నరికేస్తా...' అంటూ హెచ్చరించారు.శనివారం (నవంబర్ 6) హర్యానాలోని ఓ పబ్లిక్ ఈవెంట్‌లో అరవింద్ శర్మ మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై అక్కడున్న బీజేపీ శ్రేణులు చప్పట్లు, కేకలతో హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.

హర్యానాలోని (Haryana) కిలోయ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆలయంలో మాజీ మంత్రి మనీష్ గ్రోవర్‌ను శుక్రవారం (నవంబర్ 6) అక్కడి రైతులు 8 గంటల పాటు నిర్బంధించిన సంగతి తెలిసిందే.ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ పర్యటనను లైవ్‌లో వీక్షించేందుకు గుడిలో ఏర్పాట్లు చేయగా... మనీష్ గ్రోవర్ సహా పలువురు బీజేపీ నేతలు అక్కడికి వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న రైతులు మనీష్ గ్రోవర్‌తో పాటు అక్కడున్న బీజేపీ నేతలను ఆలయంలోనే నిర్బంధించారు.రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆయన్ను నిర్బంధించామని చెప్పారు.

Also Read: 3 Roses Teaser: విమర్శలపాలవుతున్న 3 రోజెస్ టీజర్

చివరకు ఆయన క్షమాపణలు చెప్పడంతో విడిచిపెట్టామన్నారు.మనీష్ గ్రోవర్ మాత్రం తానెవరికీ క్షమాపణలు చెప్పలేదన్నారు.తాను గుడిలో ఉన్న సమయంలో ఒకాయన లోపలికి వచ్చి రైతులకు అభివాదం చేయమన్నారని.. తాను అలాగే చేశానని చెప్పారు.అంతే తప్ప ఎవరికీ క్షమాపణ చెప్పలేదన్నారు.

బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రాకి కూడా హర్యానా రైతుల నిరసన(Farmers Protest) సెగ తాగికన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిలో రైతులు లేరని, గ్రామాల నుంచి వచ్చిన తాగుబోతులని జాంగ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన హిసార్ జిల్లాలో ధర్మశాల ప్రారంభోత్సవానికి వెళ్లగా రైతులు అడ్డుకున్నారు. నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. పోలీసులు రైతులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

కొందరు ఆందోళనకారులు ఎంపీ కారు అద్దాలను ధ్వంసంచేశారు. దాడిపై రామ్ చందర్ జాగ్రా స్పందిస్తూ.. తనపై హత్యాయత్నం జరిగిందన్నారు.దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Also Read: Vikram - The First Glance : విక్రమ్ - ది ఫస్ట్ గ్లాన్స్ చూశారా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News