3 Roses Teaser: విమర్శలపాలవుతున్న 3 రోజెస్ టీజర్

3 Roses Teaser: హిందీలో వచ్చిన 4 మోర్ షాట్స్‌ని (4 more shots please) చూసి కాపీ కొట్టి ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారంటూ 3 రోజెస్ టీజర్ (3 Roses Teaser) చూసిన ఆడియెన్స్ విమర్శిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 06:17 PM IST
3 Roses Teaser: విమర్శలపాలవుతున్న 3 రోజెస్ టీజర్

3 Roses Teaser: ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్ నుంచి వస్తోన్న మరో వెబ్ సిరీస్ పేరే ఈ 3 రోజెస్. ఈశా రెబ్బ, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. ఇషాన్, ప్రిన్స్, సంగీత్ శోభన్, వైవ హర్ష, సత్యం రాజేష్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. 

హిందీలో వచ్చిన 4 మోర్ షాట్స్‌ని (4 more shots please) చూసి కాపీ కొట్టి ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారంటూ 3 రోజెస్ టీజర్ (3 Roses Teaser) చూసిన ఆడియెన్స్ విమర్శిస్తున్నారు. సినిమాలు ఎలాగూ సొంతంగా చేయలేరు. కనీసం వెబ్ సిరీస్ అయినా సొంతంగా డైరెక్ట్ చేయలేరా అంటూ ఇంకొంత మంది నెటిజెన్స్ అసహనం వ్యక్తంచేస్తున్నారు.

Trending News