Sasikala in Aiadmk vehicle: శశికళ తిరిగి అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టనున్నారా..

Sasikala in Aiadmk vehicle: తమిళ చిన్నమ్మ శశికళ డిశ్చార్జ్ సందర్బంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటం హాట్ టాపిక్‌గా మారడమే కాదు..దేనికో సంకేతమిస్తున్నట్టు అర్ధమౌతోంది.

Last Updated : Jan 31, 2021, 03:25 PM IST
Sasikala in Aiadmk vehicle: శశికళ తిరిగి అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టనున్నారా..

Sasikala in Aiadmk vehicle: తమిళ చిన్నమ్మ శశికళ డిశ్చార్జ్ సందర్బంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటం హాట్ టాపిక్‌గా మారడమే కాదు..దేనికో సంకేతమిస్తున్నట్టు అర్ధమౌతోంది.

అవినీతి, అక్రమాస్థుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనంతరం తమిళ చిన్నమ్మ శశికళ ( Sasikala released ) విడుదలయ్యారు. జనవరి 27వ తేదీకే జైలు శిక్ష పూర్తయింది. అయితే కోవిడ్ కారణంగా బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి ( Victoria Hospital ) లో గతక పదిరోజుల్నించి ఆమె చికిత్స పొందుతున్నారు. విడుదల ప్రక్రియను 27వ తేదీన ఆసుపత్రి నుంచే పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ ( Sasikala Discharged from hospital ) అయ్యారు. ఈ సందర్బంగా శశికళ అనుచరులు ఘన స్వాగతం పలికారు. 

అయితే శశికళ వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా ( Aiadmk flag on Sasikala vehicle ) ఉండటమే హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే శశికళ జైలుకు వెళ్లిన తరువాత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీలో ఆమె బహిష్కృత నేత.  పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్న ఆమెను..అప్పటి పరిణామాల నేపధ్యంలో సస్పెండ్ చేశారు. అయినా అదే పార్టీ జెండాతో ఆమె వాహనం ఉండటం దేనికో సంకేతమిస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే శశికళకు బీజేపీ ( BJP ) అండ ఉందనే వార్త షికారు చేస్తోంది. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఏఐఏడీఎంకే ( AIADMK ) పార్టీతో భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో అన్నాడీఎంకే పార్టీ తిరిగి ఆమె నేతృత్వంలో వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అదే జరిగితే ఇప్పుడు పార్టీలో కీలకనేతలుగా ఉన్న పళనిస్వామి ( Palaniswamy ),  పన్నీర్ సెల్వమ్ ( Panneer selvam ) ‌ల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారనుంది. ఈ ఇద్దరూ ఒక్కటయ్యే..శశికళను పార్టీ నుంచి పొగబెట్టిన సంగతి తెలిసిందే మరి. 

Also read: Union Budget 2021 Date And Time: Nirmala Sitharaman ప్రవేశపెట్టనున్న కేంద్ర Budget 2021 ముఖ్యాంశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News