Wipro Jobs: కెరీర్ నిలిచిన మహిళలకు విప్రో గుడ్‌న్యూస్, బిగెన్ ఎగైన్ కార్యక్రమం

Wipro Jobs: ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో గుడ్‌న్యూస్ అందిస్తోంది. ఫ్రెషర్ల కోసం ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఆ ఉద్యోగ వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2022, 02:15 PM IST
Wipro Jobs: కెరీర్ నిలిచిన మహిళలకు విప్రో గుడ్‌న్యూస్, బిగెన్ ఎగైన్ కార్యక్రమం

Wipro Jobs: ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో గుడ్‌న్యూస్ అందిస్తోంది. ఫ్రెషర్ల కోసం ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఆ ఉద్యోగ వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటి విప్రో. విప్రో గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఐటీ విభాగం ఒకటి. విప్రో ఇప్పుడు ఫ్రెషర్ల కోసం తాజాగా రిక్రూట్ మెంట్ ప్రారంభించింది. సంస్థలోని ఎక్కౌంట్ ఎగ్జిక్యూటివ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగాల్లో ఈ ఖాళీల్ని భర్తీ చేయనుంది. హైదరాబాద్ విప్రో కార్యాలయం కోసం ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్ధులు క్లయింట్‌కు సంబంధించిన విధుల్ని చూడాల్సి ఉంటుంది. దీంతోపాటు మహిళల కోసం మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. వివిధ కారణాలతో కెరీర్ గ్యాప్ వచ్చిన మహిళలకు ఇదొక మంచి అవకాశమని కంపెనీ చెబుతోంది.

ఇందులో భాగంగా..బిగెన్ ఎగైన్ పేరుతో విప్రో సరికొత్త కార్యక్రమం ప్రారంభించింది. కరోనా వైరస్, ఇంటి సమస్యలు లేదా ఇతరత్రా కారణాలతో మహిళల కెరీర్‌లో గ్యాప్ వస్తుంటుంది. విప్రో ఇన్‌క్లూజన్ అండ్ డైవర్శిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మహిళల్ని తిరిగి రిక్రూట్ చేయనుంది. ఆరు నెలల్నించి ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువకాలం కెరీర్‌కు దూరంగా ఉన్న ఐటీ మహిళా నిపుణులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని విప్రో వెల్లడించింది. అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసుకునేందుకు విప్రో అధికారిక వెబ్‌సైట్ https://careers.wipro.com/opportunities/jobs సంప్రదించాల్సి ఉంటుంది.

Also read: Covid 19: పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కరోనా ఎఫెక్ట్.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News