Covid 19: పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కరోనా ఎఫెక్ట్.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు

Covid 19 Affects Male Fertility: కరోనా బారినపడిన పురుషులకు షాకింగ్.. కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే అవకాశం ఉన్నట్లు ఐఐటీ బాంబే తాజా పరిశోధనలో వెల్లడైంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 10:41 AM IST
  • పురుషుల సంతానోత్పత్తిపై కరోనా ప్రభావం
  • ఐఐటీ బాంబే పరిశోధనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
  • పూర్తి కథనాన్ని ఇక్కడ చదవండి
Covid 19: పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కరోనా ఎఫెక్ట్.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు

Covid 19 Affects Male Fertility: 'కోవిడ్ 19'పై ఐఐటీ బాంబే తాజా పరిశోధన పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. కోవిడ్ బారినపడిన పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని పరిశోధనలో వెల్లడైంది. స్వల్ప లక్షణాలతో కోవిడ్ బారినపడినవారిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యంపై దాని ప్రభావం ఉంటుందని తేలింది. గత వారం 'ఏసీఎస్ ఒమేగా' జర్నల్‌లో ప్రచురితమైన ఐఐటీ బాంబే పరిశోధకుల తాజా పరిశోధనతో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 

ఐఐటీ బాంబే తాజా పరిశోధన ప్రకారం... కరోనా వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థతో పాటు  శరీరంలోని ఇతర కణజాలాలపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కరోనా బారినపడిన పురుషుల్లో వారి ప్రత్యుత్పత్తి అవయవాల్లోనూ కరోనా వైరస్ ఉండే అవకాశం ఉంది. ఇది పురుషల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. కోవిడ్ సోకనివారితో పోలిస్తే కోవిడ్ బారినపడిన పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది.

ఈ పరిశోధన కోసం 20 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసున్న మొత్తం 27 మంది పురుషుల వీర్య నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. ఇందులో 10 మంది ఆరోగ్యవంతమైన పురుషులు కాగా.. మరో 17 మంది కరోనా బారినపడి కోలుకున్నవారు. కరోనా బారినపడని వారితో పోలిస్తే కరోనా నుంచి కోలుకున్నవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడంతో పాటు దాని నాణ్యత, ఆకారంలోనూ తేడాలను ఈ విశ్లేషణలో గుర్తించారు. 

కోవిడ్ 19 నుంచి కోలుకున్నవారి వీర్య నమూనాల్లో 27 ప్రోటీన్లు ఎక్కువ స్థాయిలో ఉండగా 21 ప్రోటీన్లు తక్కువ స్థాయిలో ఉన్నట్లు తేల్చారు. ఆరోగ్యవంతంగా ఉన్న పురుషులతో పోలిస్తే కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో 'సెమెనోజెలిన్', 'ప్రసపోజిన్' అనే ప్రోటీన్లు సగం కన్నా తక్కువ స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇవి పురుషుల ప్రత్యుత్పత్తి సామర్థ్యంపై ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావం చూపుతాయని వెల్లడించారు. అయితే ఈ విషయాలను నిర్ధారించేందుకు మరిన్ని విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొనడం గమనార్హం. 

Also Read: Childhood Pic: ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా... ట్రై చేయండి...

Naga Chaitanya Fined: హీరో నాగ చైతన్యకు ట్రాఫిక్ పోలీస్ జరిమానా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News