Bengaluru cyber police: గాళ్‌ఫ్రెండ్​తో ఏంచక్కా హోటల్లో ఎంజాయ్ చేసిన యువకుడికి ఊహించని షాక్!

Bengaluru: అశ్లీల వెబ్​సైట్లలో తన వీడియో రావడం చూసి ఓ యువకుడు కంగుతున్నాడు. దీనితో పోలీసులను ఆశ్రయించి విషయం చెప్పాడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 05:48 PM IST
  • అశ్లీల వెబ్​సైట్లలో తన వీడియో చూసి కంగు తిన్న యువకుడు
  • కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన
  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
Bengaluru cyber police: గాళ్‌ఫ్రెండ్​తో ఏంచక్కా హోటల్లో ఎంజాయ్ చేసిన యువకుడికి ఊహించని షాక్!

Bengaluru cyber police: బెంగళూరుకు చెందిన ఓ యువకుడికి అనుహ్యమైన షాక్ తగిలింది. అశ్లీలవెబ్​సైట్లలో తనకు సంబంధించిన వీడియో ఉండటం చూసి ఒక్క సారిగా కంగు తిన్నాడు. దీనితో ఆ వీడియోను తొలగించడం, ఎలా ఆ వీడియో వెబ్​సైట్లలోకి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులను ఆశ్రయించాడు.

ఇంతకీ ఏమైందంటే..

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన 25 ఏళ్ల యువకుడు స్థానికంగా బీపీఓ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి గాళ్​ ఫ్రెండ్ కూడా ఉంది. అయితే ఇటీవల ఆ యువకుడు తన గాళ్​​ ఫ్రెండ్​తో కలిసి ఓ హోటల్​లో స్టే చేశాడు.

తమకు కేటాయించిన ఆ హోటల్​ గదిలో ఆ యువకుడు, తన గాళ్​ ఫ్రెండ్ ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత హోటల్​ నుంచి చెకౌట్​ చేసి వెళ్లిపోయారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. సడెన్​గా ఓ రోజు ఆ యువకుడు అశ్లీల వెబ్​సైట్లో తాను, తన గర్ల్​ ఫ్రెడ్ ఏకాంతంగా గడిపిన  వీడియో ఉండటం చూసి నివ్వెర పోయాడు. ఆ వీడియో ఎవరు తీశారు, అసలు హోటల్​లో ఆ వీడియో ఎలా తీశారో అని బయపడ్డాడు. దీనితో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటన జనవరి 21న జరగగా.. ఆ యువకుడు ఈ నెల 24న పోలీసులను సంప్రదించాడు.

దార్యాప్తు కొనసాగుతోంది..

యువకుడి ఫిర్యాదుతో కర్ణాటక సైబర్, ఎకనామిక్​ అండ్ నార్కోటిక్స్​ క్రైమ్​ (సీఈఎన్​) పోలీసులు ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్నారు. ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఆ వీడియోలో ఫిర్యాదు చేసిన యువకడు, అతని గాళ్​ ఫ్రెడ్​​ ముఖాలను బ్లర్​ చేసి ఎవరో దుండగులు అప్లోడ్ చేసినట్లు తెలిపారు పోలీసులు. అయితే ఆ యువకుడు కొన్ని గుర్తుల ఆధారంగా.. ఆ వీడియోలో ఉన్నది తాను, తన గర్ల్​ ఫ్రెండే అని నిర్దారించినట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా పోలీసుల ప్రాథమిక విచారణలో మరో విస్తుపోయే నిజం బయటపడింది. ఆ వీడియను ఒకే సీక్రెట్ కెమెరాతో చిత్రీకరించినట్లు లేదని తెలిపారు. ఆ వీడియోలో కెమెరా యాంగిల్స్ మారడం గుర్తించినట్లు చెప్పారు. దీని బట్టి ఎవరో దుండగులు పక్కా ప్రణాలికతో వీడియోను చిత్రీకరించినట్లు చెప్పారు. ఈ అంశంపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు కర్ణాటక పోలీసులు.

Also read: February New Rules: ఫిబ్రవరి 1 , రేపటి నుంచి మారనున్న కొత్త రూల్స్, నిబంధనలు ఇవే

Also read: Viral Video: హైవే రోడ్డుపై 4 కిమీ మండుతూ వెళ్లిన ట్రక్కు.. చివరకు ఏమైందంటే? (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News