Hair Care: అలోవెరాతో మీ జుట్టు దృఢంగా అవ్వడమేకాకుండా, 8 రోజుల్లో నల్లగా మార్చుతుంది!

Aloe Vera For Hair Care: అలోవెరా జెల్‌ను కొబ్బరి నూనె వేసి వినియోగించడం వల్ల జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2023, 06:11 PM IST
Hair Care: అలోవెరాతో మీ జుట్టు దృఢంగా అవ్వడమేకాకుండా, 8 రోజుల్లో నల్లగా మార్చుతుంది!

Aloe Vera For Hair Care: జుట్టును సరైన రీతిలో సంరక్షించుకోలేకపోతే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. జుట్టును బలంగా, మెరిసేలా, ఆరోగ్యంగా, మృదువుగా చేయడానికి అలోవెరాను కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా బలహీనమైన జుట్టును బలంగా మార్చడానికి సహాయపడుతుంది. కాబట్టి దీనిని జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది..

కలబందను జుట్టుకు అప్లై చేసే మార్గాలు:
>కలబంద స్ప్రే:

జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా అలోవెరా స్ప్రే వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందుకోసం అరకప్పు అలోవెరా జెల్ తీసుకుని అందులో నాలుగో వంతు అల్లం రసం కలపాలి. దీనిని  స్ప్రే బాటిల్‌లో నింపి జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు బాగా వెళ్లేటట్లు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత  20 నుంచి 25 నిమిషాలు పాటు ఉంచాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే సులభంగా జుట్టు మృదువైన జుట్టును పొందవచ్చు.

>కలబంద జుట్టు ఫేస్‌ మాస్క్‌:
కలబంద జుట్టు ఫేస్‌ మాస్క్‌ కూడా జుట్టుకు ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మానికేకాకుండా జుట్టు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం  2 టీస్పూన్ల తాజా కలబంద గుజ్జు,  ఒక చెంచా పెరుగు, 2 చెంచాల తేనె తీసుకునే ఫైన్‌ మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనిని జుట్టు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన  15 నుండి 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు.

>అలోవెరా, కొబ్బరి నూనె:
జుట్టును మృదువుగా, బలంగా తయారు చేసుకోవడానికి ప్రతి రోజూ అలోవెరా జెల్‌తో పాటు కొబ్బరి నూనెను వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీనిని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో తాజా కలబంద గుజ్జును తీసుకోవాల్సి ఉంటుంది. అందులో 2 చెంచాల కొబ్బరి నూనె వేసి సన్నటి మంట మీద ఉంచి, చల్లారిన తర్వాత జుట్టుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లై చేసుకున్న తర్వాత  మర్దన చేసి ఒకటిన్నర గంటపాటు అలాగే ఉంచిన తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి 

Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News