Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి

High Tension At Gannavaram: గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌పై దాడికి పాల్పడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2023, 06:33 PM IST
Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి

High Tension At Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్తం వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఆఫీసులోని అద్దాలు పగలగొట్టి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కారుకు నిప్పుపెట్టారు ఆందోళనకారులు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను చించివేసి విధ్వంసం సృష్టించారు. మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైర్ ఇంజన్లను కూడా అడ్డుకున్నారు. 

ఎమ్మెల్యే తీరుపై టీడీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయం నుంచి జాతీయ రహదారిపై నిరసనగా బయలుదేరి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే వంశీ అరాచకాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేపై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ ఆఫీస్ చుట్టూ వంశీ కారులో తిరుగుతున్నారని వారు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్దే పోలీసులు ఉన్నా పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. కంప్యూటర్లు, ఫర్నీచర్, ఐదు వాహనాలు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. 50 నుంచి 60 మంది దాడిలో వైసీపీ నేతలు పాల్గొన్నారని తెలిపారు.  

అంతకుముందు ప్రెస్‌మీట్‌లో టీడీపీ అగ్రనేతలపై వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయగా.. తెలుగుదేశం పార్టీ నేతలు ఖండించారు. దీంతో వల్లభనేని వంశీకి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో వంశీ వర్గీయులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారు.  ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప‌్రయత్నిస్తున్నారు. 

గన్నవరం ఘటనపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. సైకో సీఎం అండతోనే వైసీపీ ఆకు రౌడీలు చెలరేగిపోతున్నారని ఫైర్ అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జగన్ రౌడీ పాలనకు పరాకాష్ట అని విమర్శించారుర. ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లో దాడి జరిగిందన్నారు. వంశీ రౌడీలు పట్టపగలే టీడీపీ కార్యాలయంలోకి చొరబడి కర్రలు, రాళ్లతో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అరాచకం సాగుతోందన్నారు. వంశీ ఒక్క ఏడాది ఓపిక పట్టాలని.. తల పొగరు అణచివేస్తామన్నారు. 

Also Read: Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. మార్చి నెలలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..   

Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News