Skin Care: జిడ్డు గల చర్మాన్ని 2 రోజుల్లో మెరిపించడం ఖాయం, ఈ చిట్కాతో చర్మ సమస్యలకు చెక్‌!

How To Make Orange Peel Scrub: జిడ్డు గల చర్మం నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయుర్వేద నిపుణులు ఈ చిట్కాలతో సులభంగా ఉపశమనం పొందొచ్చు..

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2023, 12:00 PM IST
Skin Care: జిడ్డు గల చర్మాన్ని 2 రోజుల్లో మెరిపించడం ఖాయం, ఈ చిట్కాతో చర్మ సమస్యలకు చెక్‌!

How To Make Orange Peel Scrub: ప్రస్తతం చాలా మంది ఆరెంజ్ పండ్లను జ్యూస్‌లా చేసుకుని తాగుతూ ఉంటారు. అయితే జ్యూస్‌ తయారు చేసే క్రమంలో దానిపై తొక్కను పక్కన పడేస్తారు. ఆరెంజ్‌ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలున్నాయో, తొక్కతో కూడా చర్మానికి అన్ని ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరెంజ్ పీల్ స్క్రబ్‌లా తయారు చేసుకుని చర్మానికి వినియోగించడం వల్ల జిడ్డు గల చర్మం సులభంగా దూరమవుతుంది. అంతేకాకుండా ముఖంపై పేరుకుపోయిన బ్లాక్‌ హెడ్స్, మురికి తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆరెంజ్ పీల్ స్క్రబ్ వినియోగించడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరెంజ్ పీల్ స్క్రబ్ చేయడానికి కావలసిన పదార్థాలు:
1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్  
1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్  
5 నుంచి 10 చుక్కలు రోజ్ వాటర్

ఆరెంజ్ పీల్ స్క్రబ్ తయారి పద్దతి:
ఆరెంజ్ పీల్ స్క్రబ్ చేయడానికి.. ముందుగా ఒక గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత గిన్నెలో అలోవెరా జెల్, ఆరెంజ్ పీల్ పౌడర్, రోజ్ వాటర్ వేయాలి.
వీటిని బాగా కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
అంతే సులభంగా  ఆరెంజ్ పీల్ స్క్రబ్ సిద్ధమవుతుంది.

ఆరెంజ్ పీల్ స్క్రబ్ తయారి విధానం:
ఆరెంజ్ పీల్ స్క్రబ్‌ను అప్లై చేసే ముందుగా ముఖాన్ని క్లీన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ మిశ్రమాన్ని ముఖం మొత్తం అప్లై చేయాల్సి ఉంటుంది.
తర్వాత నెమ్మదిగా రుద్దుతూ సుమారు 2-3 నిమిషాలు ముఖాన్ని స్క్రబ్ చేయండి.
ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: IPL Updates: ఫుల్ కిక్కే కిక్.. క్రికెట్ పండుగకు వేళయా.. నేడే ఐపీఎల్ ప్రారంభం 

Also Read: Sunrisers Hyderabad: తొలి మ్యాచ్‌కు ముందు మార్పు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News