IPL Updates: ఫుల్ కిక్కే కిక్.. క్రికెట్ పండుగకు వేళయా.. నేడే ఐపీఎల్ ప్రారంభం

Indian Premier League 2023: అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేందుకు ఐపీఎల్ వచ్చేసింది. సిక్సర్ల వర్షంలో మునిగిపోయిందుకు సిద్ధమైపోండి. నేటి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభంకానుంది. టైటిల్‌ను ఒడిసిపట్టుకునేందుకు 10 జట్లు రెడీ అయిపోయాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 07:10 AM IST
  • నేటి నుంచే ఐపీఎల్ ప్రారంభం
  • 58 రోజులపాటు సాగనున్న సీజన్
  • 12 స్టేడియాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు
IPL Updates: ఫుల్ కిక్కే కిక్.. క్రికెట్ పండుగకు వేళయా.. నేడే ఐపీఎల్ ప్రారంభం

Indian Premier League 2023: ఒక ట్రోఫీ.. 10 జట్లు.. 58 రోజులు.. 12 స్టేడియాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు.. క్రికెట్ పండుగ నేటి నుంచి షురూ కానుంది. అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య పోరుతో శుక్రవారం సాయంత్రం నుంచి మొదలుకానుంది. మరోసారి ఛాంపియన్‌గా నిలవాలని గుజరాత్.. ధోనికి టైటిల్‌ గెలుపుతో వీడ్కోలు పలకాలని చెన్నై.. ఐపీఎల్‌లో తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని ముంబై.. మళ్లీ పుంజుకోవాలని సన్‌రైజర్స్, రాజస్థాన్, కోల్‌కత్తా.. ఒక్కసారైనా ట్రోఫీని ముద్దాడాలని పంజాబ్, ఢిల్లీ, ఆర్‌సీబీ, లక్నో జట్లు బరిలోకి దిగుతున్నాయి. మూడేళ్ల తర్వాత జట్లు తమ సొంత మైదానంలో ఆడుతుండడం అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. 

ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి లీగ్ రౌండ్‌లో మొత్తం 10 జట్లు తలో 14 మ్యాచ్‌లు ఆడనున్నాయి. గ్రూప్‌ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తరువాత ప్లే ఆఫ్స్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నారు. లీగ్ దశలో ప్రతి జట్టు హోమ్‌ గ్రౌండ్‌లో ఏడు మ్యాచ్‌లు.. ప్రత్యర్థి జట్టు గ్రౌండ్‌లో ఏడు మ్యాచ్‌లు తలపడనుంది. ఈసారి డిస్నీ + హాట్‌స్టార్‌తోపాటు వయాకామ్ 18 ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను దక్కించుకుంది. ఓటీటీ ప్రసార హక్కులను రూ.20,500 కోట్లకు కొనుగోలు చేసింది. ఓటీటీలో జియో సినిమా యాప్ మనదేశంలోని వినియోగదారుల కోసం ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అంటే ఈసారి ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చు. 

గాయాల బెడద అన్ని జట్లను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఢిల్లీ, కోల్‌కత్తా జట్లు తమ కెప్టెన్లను మిస్ అయ్యాయి. ఈ సీజన్‌కు మొత్తంగా నాలుగు జట్లు కొత్త కెప్టెన్లతో రంగంలో దిగుతున్నాయి. రిషబ్ పంత్ స్థానంలో ఢిల్లీకి డేవిడ్ వార్నర్‌, పంజాబ్‌కు శిఖర్ ధావన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మార్‌క్రమ్‌, కోల్‌కతాకు నితీష్‌ రాణా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. వార్నర్, ధావన్‌కు ఐపీఎల్‌లో ఇప్పటికే కెప్టెన్సీ అనుభవం ఉండగా.. మార్‌క్రమ్, నితీష్ రాణా తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టనున్నారు.

 

రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య టైటిల్ పోరు ఆరంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ముందుగా ఆరంభవేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. క్రికెట్ అభిమానులకు అద్భుతమైన ప్రదర్శనలు, మరపురాని అనుభవాలను అందించేందుకు నిర్వాహకులు రెడీ అయ్యారు. ఈ వేడుకలో రష్మిక మందన్న, తమన్నా భాటియా, కత్రినా కైఫ్, టైగర్ ష్రాఫ్, అరిజిత్ సింగ్‌లను సందడి చేయనున్నారు. నేటి నుంచి మీరూ కూడా క్రికెట్ మాయలో ఎంజాయ్ చేయండి.

Also Read: Mysterious Disease: కరోనా కంటే డేంజర్ వైరస్.. 24 గంటల్లోనే ముక్కు నుంచి రక్తం కారుతూ ముగ్గురు మృతి   

Also Read: IPL 2023: డామిట్ కథ అడ్డం తిరిగింది.. కోట్ల ధర పలికి చివరికి..!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News