Black Pepper for Hair: నల్లమిరియాలు హెయిర్‌కు ఇలా అప్లైచేస్తే నమ్మలేని పెరుగుదలను చూస్తారు..

Black Pepper for Hair: మిరియాలను సాధారణంగా మనం వంటల్లో వినియోగిస్తాం. దీంతో వంటకు మంచి అరోమా వస్తుంది. ఆయుర్వేద పరంగా కూడా మిరియాలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. దీంతో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : May 17, 2024, 02:22 PM IST
Black Pepper for Hair: నల్లమిరియాలు హెయిర్‌కు ఇలా అప్లైచేస్తే నమ్మలేని పెరుగుదలను చూస్తారు..

Black Pepper for Hair: జుట్టు రాలే సమస్య ఈరోజుల్లో ఎక్కువగా పెరిగింది. దీనికి కొన్ని రెమిడీలు ప్రయత్నిస్తే  జుట్టు బాగా పెరుగుతుంది మిరియాలను సాధారణంగా మనం వంటల్లో వినియోగిస్తాం. దీంతో వంటకు మంచి అరోమా వస్తుంది. ఆయుర్వేద పరంగా కూడా మిరియాలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. దీంతో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.అయితే, నల్ల మిరియాలను వాడటం వల్ల మీ జుట్టు రెండింతల స్పీడ్‌తో పెరుగుతుంది. అంతేకాదు మీ జుట్టు ఆరోగ్యంగా కూడా మారుతుంది. నల్ల మిరియాలు జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. ఇప్పటి వరకు మనం మిరియాలతో కషాయం మాత్రమే తయారు చేసుకున్నాం. దీంతో హెయిర్ టోనర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.  

నల్ల మిరియాలతో జుట్టు​ ఆరోగ్యం..
నల్ల మిరియాలను మన జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మిరియాలు మన జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలపడుతుంది.ఇందులో కరోనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫోలిక్ యాసిడ్ వంటి మూలకాలు ఉంటాయి. అంతేకాదు మిరియాల్లో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. మన జుట్టులో చుండ్రు అధికంగా ఉంటే హెయిర్ ఫాల్‌ సమస్య విపరీతంగా పెరుగుతుంది. మిరియాల టోనర్ తయారు చేసుకుని వాడితే జుట్టుపై ఉండే డ్యాండ్రఫ్‌ తొలగిపోతయి. జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుంది. మిరియాలు టోనర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

మిరియాలతో టోనర్‌ను తయారు చేసుకునే విధానం..
కావాల్సిన పదార్థాలు..
నీళ్లు - 2ltr
మిరియాలు -50gm

ఇదీ చదవండి: బాస్కెట్‌ బాల్‌ ఆడితే మన శరీరానికి 7 అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా?

మిరియాలతో టోనర్ తయారు చేసుకునే విధానం..
మిరియాలతో టోనర్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్‌ తీసుకుని స్టవ్‌ ఆన్‌ చేయాలి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్‌ పెట్టి ఒక గిన్నె పెట్టి నీళ్లు పోసుకోవాలి. పొడి చేసి పెట్టుకున్న మిరియాలను అందులో వేయాలి. దీన్ని బాగా మరిగించుకోవాలి. లీటర్ నీళ్లు దాదాపు నాలుగోవంతు అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిరియాల నీటిని ఓ పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఈ నీటిని వడకట్టుకోవాలి. ఓ స్ప్రే బాటిల్‌లోకి ఆ నీటిని నింపండి. దీంతో మన జుట్టుకు స్ప్రే చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? రాత్రిపడుకునే ముందు ఈ ఒక్క డ్రింక్ తాగి చూడండి..

జుట్టుకు మిరియాల టోనర్ అప్లై చేసుకునే విధానం..
ఇలా తయారు చేసుకున్న మిరియాల టోనర్‌ను ప్రతి రోజూ అప్లై చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఈ మిరియాల టోనర్ జుట్టుకు స్ప్రే చేసుకోవాలి. ఇలా వారానికి కనీసం మూడు సార్లు అయినా చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. రాత్రి జుట్టుకు స్ప్రే చేసిన తర్వాత ఉదయం తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డ్యాండ్రఫ్‌ సమస్య రాదు. ఉన్నా తగ్గిపోతుంది. అతి త్వరలోనే మీ జుట్టు పెరుగుదలను గమనిస్తారు. అంతేకాదు కొత్త జుట్టు కూడా పెరుగుతుంది. నీటితోనే కాదు మిరియాలను ఉపయోగించి నూనెను కూడా తయారు చేసుకోవచ్చు. మిరియాల పొడిని కొబ్బరి నూనెలో వేసి వేడి చేసుకోవాలి. మిరియాలను పొడి కొట్టుకుని దాన్ని చిన్న మంటపై వేడి చేసిన కొబ్బరి నూనెలో వేసుకోవాలి. రంగు మారిన తర్వాత ఆ నీటిని ఓ బాటిల్‌లో నిల్వ చేసుకోవచ్చు. దీన్ని కూడా తరచూ మన జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు మ్యాజిక్ చేసినట్లే పెరుగుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News