For better Sleep: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు ఈ కాలంలో చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా మరికొంత మందికి ఆరోగ్య సమస్యల వల్ల నిద్ర లేమితో బాధపడుతున్నారు. దీనివల్ల ముఖ్యంగా స్ట్రెస్, డిప్రెషన్ సమస్యలు కూడా వస్తాయి. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇంట్లో చేసుకునే కొన్ని రకాల డ్రింక్స్ వల్ల హాయిగా నిద్ర పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
వేడిపాలు..
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగి పడుకోవాలి. దీని వల్ల మంచి నిద్ర పడుతుంది. గోరువెచ్చని పాలు నిద్ర కు ఉపక్రమించేలా ప్రేరేపిస్తాయి. మంచి నిద్ర కూడా పడుతుంది. పాలలో మెలటోనిన్, సెరటోనిన్ పుష్కలంగా ఉంటాయి ఇవి మంచి నిద్ర రావడానికి సహాయపడతాయి.
ఇదీ చదవండి: వేడివేడిగా గోంగూర చికెన్ ఇలా తయారుచేస్తే ఒక్కపూటకే గిన్నె ఖాళీ..
పసుపు పాలు..
పసుపు వేసుకుని పాలు తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇది ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. ఇది మనకు కావాల్సిన నిద్రను ఇస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. సీజనల్ వ్యాధులు కూడా రాకుండా పసుపు పాలు సహాయపడతాయి.
అశ్వగంధ టీ..
అశ్వగంధ టీ చేసుకుని తాగడం వల్ల కూడా నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు.కొన్ని నివేధికల ప్రకారం అశ్వగంధ టీ తీసుకోవడం వల్ల 72 శాతం ప్రభావవంతమైన ఫలితాలు కనిపించినట్లు తెలిపింది.
ఇదీ చదవండి: పాలను ఇలా వాడితే మీ ముఖం మిలమిలా మెరిసిపోతుంది..
బాదం పాలు..
ట్రిప్టోఫన్, మెలటోనిన్, మెగ్నీషియం ఇతర ఖనిజాలు కూడా బాదం పాలలో ఉంటాయి. ఇవి మంచి నిద్రకు సహాయపడతాయి. బాదంతో తయారు చేసిన పాలు రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఇది కూడా నిద్ర లేమి సమస్యకు చెక్ పెడుతుంది.
చమోమిలే టీ..
ఇది కూడా మరో ఆరోగ్యకరమైన డ్రింక్, మీ డైలీ రొటీన్‌లో చమోమిలే టీ తీసుకోవడం వల్ల నిద్ర లేమి సమస్యలు ఉండవు. ముఖ్యంగా ఇది వాపు సమస్యను తగ్గిస్తుంది. జలుబు రాకుండా మంచి ఆరోగ్యానికి సహాయపడుతుంది. చమోమిలే టీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హాయిగా నిద్ర పట్టడానికి మంచి జీర్ణక్రియకు సహకరిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter