Vitamin Deficiency: ఏదైనా పని చేసే క్రమంలో ఊపిరి ఆగిపోతుందా.. అయితే ఇలా చేయండి చాలు..!

Breathlessness Due To Vitamin Deficiency: ఊపిరి ఆడకపోవడానికి, శ్వాస ఆడకపోవడానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా మందిలో ఆడేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా వాలుపై పైకి ఎక్కేటప్పుడు ఊపిరి ఆడకపోవడం జరుగుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2022, 11:09 AM IST
  • ఊపిరి ఆడకపోవడానికి ప్రధాన కారణాలు..
  • విటమిన్ డి లోపం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి
  • కాబట్టి అధిక పోషకాలున్న ఆహారాలను తీసుకోండి
Vitamin Deficiency: ఏదైనా పని చేసే క్రమంలో ఊపిరి ఆగిపోతుందా.. అయితే ఇలా చేయండి చాలు..!

Breathlessness Due To Vitamin Deficiency: ఊపిరి ఆడకపోవడానికి, శ్వాస ఆడకపోవడానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా మందిలో ఆడేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా వాలుపై పైకి ఎక్కేటప్పుడు ఊపిరి ఆడకపోవడం జరుగుతుంది. కానీ అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్య ఉంటే.. అది ఏదైనా వ్యాధికి దారి తీసే అవకాశం ఉంది. అయితే చాలా మందిలో శరీరంలో అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో విటమిన్‌ డి లోపం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావడం విశేషం. అయితే ఈ లోపం వల్ల ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ డి లోపం వల్ల శ్వాస సమస్యలు వస్తాయా..?:

విటమిన్ డి లోపానికి అతి పెద్ద కారణం శరీరానికి అవసరమైన పలు ఆహారాలు తీసుకోకపోవడమేనని నిపుణులు తెలుపుతున్నారు. అయితే సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి సూర్యరశ్మి ముందు 5 నిమిషాల పాటు ఉండడం చాలా మంచిది.

విటమిన్ డి లోపం వల్ల ఉత్పన్నమయ్యే లక్షణాలు:

    >>శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది.
   >> కండరాలలో బలహీనత అనుభూతి చెందుతుంది.
    >>బలహీనమైన ఎముకలు, శరీర నొప్పి.
    >>ఎముకల సాంద్రత తక్కువగా ఉండటం, కీళ్లలో నొప్పి.
    >>గాయం నయం కావడానికి ఎక్కువ సమయం పట్టడం.
    >>పిల్లలలో దంతాల సమస్యలు.

విటమిన్ డి మూలాలు:

>>విటమిన్ డి లోపాన్ని నియంత్రించడానికి శరీరాన్ని సూర్యరశ్మి ముందు ఉంచుకోండి. కాబట్టి రోజూ కనీసం 15 నిమిషాల పాటు ఎండలో నిలబడండి.
>>గుడ్లలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ డి అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ఈ లోపంతో బాధపడుతున్నవారు రోజూ 2 గుడ్లు తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
>>మష్రూమ్‌లో కూడా శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని తరచుగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఇందులో విటమిన్ డి కూడా అధిక పరిమాణంలో ఉంటుంది.
>>విటమిన్ డి పొందడానికి సాల్మన్ ఫిష్ కూడా తీసుకోవచ్చు. ఇందులో శరీరాన్ని దృఢంగా చేసే మూలకాలు ఉంటాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

Also Read: Horoscope Today September 11th 2022: నేటి రాశి ఫలాలు... చంద్ర బలంతో ఈ రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News