Horoscope Today September 11th 2022: ఇవాళ ఆదివారం. హిందూ శాస్త్రాల ప్రకారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఇవాళ సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి.. తలస్నానం చేసి.. కాసేపు ధ్యానం చేసి.. ఆ తర్వాత సూర్య దేవుడిని పూజించాలి. ఒక రాగి చెంబులో కొన్ని నీళ్లు తీసుకుని.. అందులో కుంకుమ, అక్షితలు వేసి ఆ ఆర్ఘ్యాన్ని సూర్య భగవానుడికి సమర్పించాలి. 'ఓం సూర్యదేవాయ నమ:' అని ఆ దైవాన్ని మనసులో తలచుకోవాలి. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుంది.మరి ఈ ఆదివారం ఏయే రాశుల జాతకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...
మేష రాశి (Aries) :
ఇవాళ మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారంలో కలిసొస్తుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవొచ్చు. కొన్ని సంఘటనల ప్రభావం మీకు నిద్రను దూరం చేస్తుంది. తెలియని ఆందోళన మనసులో నాటుకుంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. మీకు అందాల్సిన డబ్బు ఎట్టకేలకు అందుతుంది. ఉద్యోగస్తులు కొలిగ్స్ సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త ప్లాన్స్ అమలుచేస్తారు.
వృషభ రాశి (Taurus)
వ్యాపారపరంగా మీ బ్రాండ్‌కు డిమాండ్ పెరుగుతుంది. క్లయింట్ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కెరీర్లో మీ ఎదుగుదల మీ కుటుంబ సభ్యుల్లో, బంధువుల్లో మీ పట్ల గౌరవం పెరిగేలా చేస్తుంది.అవివాహితులకు పెళ్లి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయి. వివాహితులు జీవితభాగస్వామి వద్ద ఏదీ దాచవద్దు. లేనిపక్షంలో ఇద్దరి మధ్య గ్యాప్స్ వస్తాయి.
మిథున రాశి (GEMINI)
ఇవాళ మనసంతా ఆధ్యాత్మికత వైపు లాగుతుంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే అవకాశం ఉంది. దైవ సన్నిధిలో మానసిక ప్రశాంతత ఫీలవుతారు. ఆర్థికంగా, నైతికంగా మరింత బలపడుతారు. ఓపికతో వ్యవహరించడం చాలా విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ సంతృప్తి మీకు తెలుస్తుంది.కష్టాల్లో ఉన్నవారికి తోచిన సాయం అందిస్తారు.
కర్కాటక రాశి (Cancer)
రాత్రిపూట ప్రయాణాలు మానుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్తే పని ముగించుకుని నేరుగా ఇంటికి చేరండి. ఇవాళ మీ కోపమే మీకు శత్రువుగామారవచ్చు. షార్ట్ టెంపర్‌ను కంట్రోల్లో ఉంచుకుంటే మంచిది. ప్రేమికులు అనవసర వాదనలతో లేనిపోని మనస్పర్థలు తెచ్చుకోవద్దు. పెళ్లి విషయంలో కీలక నిర్ణయాలకు అనువైన సమయం.
సింహ రాశి (LEO)
చంద్ర బలంతో అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. స్థిరాస్తి పెట్టుబడులు కలిసొస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.వ్యాపారంలో పార్ట్‌నర్స్‌తో వివాదాలు తొలగిపోతాయి. వ్యాపార వృద్ధి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. కుటుంబ సభ్యులు,సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి.
కన్య రాశి (Virgo)
మీ ప్రత్యర్థులు, శత్రువులు ప్రస్తుతానికి మీవైపు కన్నెత్తి చూడరు. న్యాయపరమైన వివాదాల్లో మీకు అనుకూలమైన తీర్పు వింటారు. మీ హార్డ్ వర్క్, అంకితభావం పట్ల మీ బాస్ సంతృప్తితో ఉంటాడు. సింగిల్స్ తమ సోల్‌మేట్‌ను కలుసుకుంటారు. విద్యార్థులు చదువుపై మరింత ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
తులా రాశి (Libra)
మీకున్న నెట్‌వర్క్‌తో బిజినెస్‌లో కొత్త ప్లాన్స్ అమలుచేస్తారు. మీ తెలివితేటలు వ్యాపారంలో బాగా ఉపయోగపడుతాయి. ఇవాళ మంచి లాభాలు పొందుతారు. కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది. మీకు మీ జీవితభాగస్వామికి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇద్దరు కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి (Scorpio)
ఇవాళ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మానసిక ఆందోళన మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. సహనం కోల్పోతారు. కష్టపడి సంపాదించిన డబ్బును అనవసర వాటికి ఖర్చు చేస్తారు. అది మీ సేవింగ్స్‌పై ప్రభావంచూపుతుంది. ప్రేమికులు బ్రేకప్ చెప్పుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
చంద్ర బలంతో విధి మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతీ పని సక్సెస్ అవుతుంది. వ్యాపార లేదా ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేస్తారు. తోబుట్టువుల నుంచి గుడ్ న్యూస్ అందవచ్చు. ఇంటి పునర్నిర్మాణం లేదా మరమత్తులు చేపడుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
మకర రాశి (Capricorn)
ఇవాళ సంతోషంగా గడుపుతారు. మీ లైఫ్ స్టైల్ మరింత మెరుగవుతుంది. ఫ్యామిలీ, స్నేహితుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం.సింగిల్స్‌కు తగిన జోడీ దొరుకుతుంది. ప్రేమికులు ఏకాంత సమయాలను ఆస్వాదిస్తారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius)
ప్రేమికులకు ఇవాళ శుభదినం. పెళ్లికి సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు పొందే అవకాశం ఉంది. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరినట్లే. ఉద్యోగ, వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. ఉద్యోగులకు పనిభారం ఎక్కువగా ఉండొచ్చు. వ్యాపారస్తులు కొత్త డీల్స్ పొందుతారు.
మీన రాశి (Pisces)
ఇవాళ మీకు నిరాశజనకంగా, అసంతృప్తిగా గడుస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడి ఉన్నప్పటికీ ధనం మీ చేతిలో నిలవదు. సమయానికి చేతిలో డబ్బు లేకపోవడం బాధిస్తుంది. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. విద్యార్థులకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులు కొన్నాళ్లు అనవసర విషయాలపై చర్చలు మానేయాలి. లేనిపక్షంలో బ్రేకప్‌కు దారితీయవచ్చు.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: శర్వా నా కొడుకున్నాడు, మంచు విష్ణు అహంకారన్నాడు.. పాపం వెన్నెల కిషోర్ బాధ విన్నారా?
Also Read: Bandi Sanjay: 4వ విడత బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook