Bill Reducing Tips: ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే.. మీ కరెంటు బిల్లు సగానికి తగ్గిపోతుంది..

Bill Reducing Tips: ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత మోగిపోతుంది. ఇలాంటి సమయంలో పవర్ బిల్లును తగ్గించే సింపుల్ చిట్కాలు మీ కోసం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2023, 04:29 PM IST
Bill Reducing Tips: ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే.. మీ కరెంటు బిల్లు సగానికి తగ్గిపోతుంది..

Bill Reducing Tips: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అంతేకాకుండా ఈ వేసవిలో కరెంటు బిల్లు తడిసి మోపుడవుతోంది. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతుంది. మీకు ప్రతి నెలా ఎక్కువగా పవర్ బిల్లు వస్తుంటే.. ఈ సింపుల్ చిట్కాలతో సగానికిపైగా తగ్గించవచ్చు. వేసవి కాలంలో ఈ గాడ్జెట్‌లను ఉపయోగించడం మీరు విద్యుత్ ను ఆదా చేయవచ్చు. అవేంటో చూద్దాం. 

సోలార్ ప్యానెల్ - సౌర శక్తిని విద్యుత్ మార్చడానికి సౌర ఫలకాలను ఉపయోగిస్తారు. ఇంటి విద్యుత్ అవసరాలను తీర్చడంలో సోలార్ ప్యానెల్స్ అద్భుతంగా పనిచేస్తాయి. 

ఎనర్జీ సేవింగ్ లైట్ - ఎనర్జీ సేవింగ్ లైట్లు తక్కువ మొత్తంలో విద్యుత్ శక్తిని ఉపయోగించే బల్బులు. ఈ బల్బులను ఉపయోగించడం ద్వారా మీరు విద్యుత్ వినియోగాన్ని సగానికి తగ్గించవచ్చు. దీంతో పవర్ బిల్లు మీకు చాలా తక్కువగా వస్తుంది. 

స్మార్ట్ ప్లగ్‌లు - ఇంటిలోని ఎలక్ట్రికల్ ఉపకరణాలను సులభంగా ఆన్ లేదా ఆఫ్ చేయడానికి స్మార్ట్ ప్లగ్‌లను ఉపయోగిస్తారు. వీటిని స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర స్మార్ట్ పరికరం ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు లేదా టైమర్‌ని సెట్ చేయడం ద్వారా వాటిని ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. దీనితో మీరు విద్యుత్తును ఆదా చేయవచ్చు. మరోవైపు  పవర్ కట్ స్విచ్‌లను ఉపయోగించడం ద్వారా కూడా విద్యుత్తు బిల్లును తగ్గించుకోవచ్చు. 

స్మార్ట్ థర్మోస్టాట్ - విద్యుత్ ఆదా చేయడానికి స్మార్ట్ థర్మోస్టాట్‌లు చాలా బాగా ఉపయోగపడతాయి. దీనిని మీ స్మార్ట్‌ఫోన్ నుండి కూడా కంట్రోల్ చేయవచ్చు. అంతేకాకుండా మీ ఇంటి ఉష్ణోగ్రతను సులభంగా నియంత్రించవచ్చు. ఇది ఎయిర్ కండీషనర్ కోసం కూడా ఉపయోగించబడుతుంది.

Also Read: Hair Care Tips: జుట్టు సిల్కీగా, మెరిసేలా అందగా ఇలా 4 రోజుల్లో పొందొచ్చు!

స్మార్ట్ మీటర్ - మనం ఎంత విద్యుత్ ఉపయోగించామనేది స్మార్ట్ మీటర్ బట్టి  చెప్పేయచ్చు. ఈ మీటర్లు కరెంటు బిల్లును తగ్గించడంలో సహాయపడతాయి. ఎందుకంటే ఇవి ఓ చిప్‌ను కలిగి ఉంటాయి.

స్మార్ట్ యాప్‌లు - కొన్ని స్మార్ట్ యాప్‌లు మీ విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ యాప్‌ల ద్వారా మీరు మీ గృహోపకరణాలను కంట్రోల్ చేయవచ్చు.

Also Read: Optical Illusion Images: మీ కళ్లను మోసం చేసే చిత్ర ఇదే, మీకు ఈ ఫోటోలో ఏం కనిపిస్తుంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News