Hair Care Tips: జుట్టు సిల్కీగా, మెరిసేలా అందగా ఇలా 4 రోజుల్లో పొందొచ్చు!

Hair Care Tips At Home: జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల చిట్కాలున్నాయి. అయితే జుట్టు సిల్కీగా, మెరిసేలా తయారు కావడానికి తప్పకుండా రైస్‌ కెరాటిన్ మాస్క్ వినియోగించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2023, 02:08 PM IST
Hair Care Tips: జుట్టు సిల్కీగా, మెరిసేలా అందగా ఇలా 4 రోజుల్లో పొందొచ్చు!

Hair Care Tips At Home: జుట్టు అందాన్ని మెరుగుపరుచుకోవడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం చాలా మందిలో జుట్టులో తేమ కోల్పోవడవ వల్ల తీవ్ర జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలా మంది  సిల్కీగా, మెరిసేలా పొండానికి ఆయిల్ మసాజ్, కండీషనర్ లేదా హెయిర్ స్పా మొదలైనవాటిని ఆశ్రయిస్తున్నారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా సులభంగా  ఇంట్లోనే బియ్యం కెరాటిన్ మాస్క్‌ను వినియోగించడం వల్ల జుట్టు సిల్కీగా, మెరిసేలా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టుకు వినియోగించడానికి ఈ రైస్ కెరాటిన్ మాస్క్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

రైస్‌ కెరాటిన్ మాస్క్ తయారీకి అవసరమైన పదార్థాలు:
ఒక స్పూన్ గుడ్డులోని తెల్లసొన
ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్
ఒక చిన్న గిన్నె ఉడకబెట్టిన అన్నం
ఒక 1/2 స్పూన్ కొబ్బరి నూనె

ఈ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం:
రైస్ కెరాటిన్ హెయిర్ మాస్క్ చేయడానికి.. ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ బియ్యాన్ని తీసుకుని అన్నంలా తయారు చేసుకోవాలి.
తర్వాత ఈ బియ్యాన్ని బాగా మెత్తగా నూరుకోవాలి.
అయితే మిశ్రమంగా తయారు చేసుకుని అందులో తెల్ల గుడ్డు సొన వేసి బాగా కలపాల్సి ఉంటుంది.
అదే మిశ్రమంలో ఆలివ్ నూనె, కొబ్బరి నూనె కలపాలి.
ఈ మిశ్రమాలను బాగా కలిపిన తర్వాత ఓ బౌల్‌లోకి తీసుకుని జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

ఇది కూడా చదవండి:  Lavender Oil for Hair: లావెండర్ ఆయిల్‌తో పర్మినెంట్‌గా తెల్ల జుట్టు నల్లగా మారటం ఖాయం! 

ఈ మాస్క్‌ను వినియోగించే పద్ధతి:
మాస్క్‌ను వినియోగించడానికి ముందు షాంపూతో మీ జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా చేసిన తర్వాత జుట్టుకు బాగా మాస్క్‌ను అప్లై చేయాలి.
సుమారు 30-40 నిమిషాలు పాటు జుట్టుకు అలానే ఉంచాలి.
ఇలా ఆరిన తర్వాత జుట్టును షాంపూతో కడితే మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణల, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

ఇది కూడా చదవండి:  Lavender Oil for Hair: లావెండర్ ఆయిల్‌తో పర్మినెంట్‌గా తెల్ల జుట్టు నల్లగా మారటం ఖాయం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News