వ్యాయమానికి టైమ్ లేదా ? అయితే 2 నిమిషాలు ఇలా చేయండి

వ్యాయమానికి సమయం లేదా ? అయితే 2 నిమిషాలు ఇలా చేయండి

Last Updated : Oct 28, 2019, 10:59 AM IST
వ్యాయమానికి టైమ్ లేదా ? అయితే 2 నిమిషాలు ఇలా చేయండి

ఉద్యోగం, వ్యాపార రీత్యా బిజీగా ఉండే వారి జీవితాలు నిత్యం ఉరుకులు పరుగులతోనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతుంటాయి. ఇంత బిజీ జీవితంలో ఇక వ్యాయమానికి సమయం ఎక్కడిది అనేదే చాలామంది నోట వచ్చే సర్వసాధారణమైన సమాధానం. కానీ మనసుంటే మార్గం ఉంటుందన్నట్టుగా.. కొద్దిగా మనసు పెడితే.. 2 నిమిషాల్లోనే శరీరం మొత్తానికి మేలు చేసే వ్యాయమాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. ఎక్కువ సమయం కేటాయించలేని పరిస్థితుల్లో కనీసం రెండు నిమిషాలైనా వ్యాయమానికి కేటాయిస్తే మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
 
తక్కువ సమయంలో ఎక్కువ మేలు చేసే ఎక్సర్‌సైజ్‌లు ఏమైనా ఉన్నాయా అంటే అందులో పుషప్స్ ముందు వరుసలో ఉంటాయనేది నిపుణుల సలహా. కేవలం రెండు నిమిషాల సమయం కేటాయించి సరైన పద్ధతిలో పుషప్స్ చేస్తే.. శరీరానికి పూర్తిస్థాయి వ్యాయమం చేసినంత మేలు కలుగుతుందంటున్నారు వ్యాయమనిపుణులు. పుషప్స్‌తో పాదాల నుంచి, తల వరకు మొత్తం శరీరంలోని ప్రతీ అవయవాన్నీ ప్రభావితం చేసే శక్తి పుషప్స్‌కు ఉందని ఓ అధ్యయనంలో తేలింది. పుషప్స్‌తో గుండె రక్తనాళాలు ఉత్తేజితమవడంతోపాటు చేతులు, కాళ్లు, నడుం కింద వెనుక భాగంలో కండరాలు ధృడంగా తయారవుతాయని, అలాగే మంచి శరీరసౌష్టవం ఏర్పడుతుందనేది నిపుణుల సలహా.

రోజూ రెండు నిమిషాలు వెచ్చించి పురుషులైతే 40, స్త్రీలు అయితే 20 పుషప్స్‌ చేస్తే చాలు. నిత్యం క్రమం తప్పకుండా 10 పుషప్స్‌ చేసే 40 ఏళ్ల వయసు వాళ్లనూ పరిశీలించగా.. ఇతరులతో పోలిస్తే, వారిలో గుండె పని తీరు బాగున్నట్టు గుర్తించారు. ఇక అదే సమయంలో రోజుకు 40కి మించి పుషప్స్‌ చేసేవారిలో 96 శాతం మందికి అసలు గుండె సమస్యలే తలెత్తలేదని నిపుణుల పరిశీలనలో తేలింది. మరి ఇంకేం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మంచి శరీరాకృతినిచ్చే పుషప్స్ కోసం ఓ రెండు నిమిషాలైనా వెచ్చించగలరేమో ఒకసారి ఆలోచించండి.

Trending News