TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..? 

Kodali Naren TANA: అమెరికాలో తెలుగువారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న సంఘాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఒకటి. తెలుగు రాష్ట్రాల నుంచి అగ్రరాజ్యం అమెరికా వెళ్తున్న ప్రతి ఒక్క తెలుగు వారి కోసం తానా సేవలు అందిస్తుంటుంది. అలాంటి తానాకు రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో వర్జీనియాకు చెందిన డాక్టర్‌ నరేన్‌ కొడాలి అధ్యక్షుడిగా గెలిచారు. 2023 ఎన్నికల్లో నరేన్‌ ప్యానెల్‌ విజయవం సాధించిందని తానా ఎన్నికల కమిటీ ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 11:35 AM IST
TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..? 

Telugu NRIs: అమెరికాలో ప్రముఖ తెలుగువారికి చెందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికలు అనూహ్య మలుపుల మధ్య జరిగాయి. ఎట్టకేలకు ఎన్నికల్లో కొడాలి నరేన్‌ ప్యానెల్‌ విజయం సాధించింది. తానా తదుపరి అధ్యక్షుడిగా నరేన్‌ గెలుపొందారు. రెండేళ్లకోసారి జరిగే ఎన్నికలు కొంతకాలంగా తీవ్ర వివాదస్పదమయ్యాయి. చివరికి న్యాయ వివాదంలో కూడా చిక్కుకున్నాయి. వర్చువల్ పద్ధతిలో జరిగిన తానా ఎన్నికల ఫలితాలను ఈనెల 18న విడుదల చేశారు. విడుదలైన ఫలితాల్లో అన్ని పదవులను నరేన్‌ ప్యానెల్‌ వశమయ్యాయి. ఆన్‌లైన్‌ పద్ధతిలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం గమనార్హం.

ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్థానానికి సతీశ్‌ వేమూరి, నరేన్‌ పోటీపడ్డారు. సతీశ్‌పై 13,225 ఓట్లతో నరేన్‌ గెలుపొందారు. బోర్డు డైరెక్టర్లుగా లావు శ్రీనివాస్‌, రవి పొట్లూరి, మల్లి వేమన, కార్యదర్శిగా రాజా కసుకుర్తి, కోశాధికారిగా భరత్‌ మద్దినేని, సంయుక్త కార్యదర్శిగా వెంకట్‌ కోగంటి, సంయుక్త కోశాధికారిగా సునీల్‌ పాంత్రా ఎన్నికయ్యారు.

కార్యవర్గం ఇదే..
కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌గా లోకేశ్‌ కొణిదల, సాంస్కృతిక సేవా సమన్వయకర్తగా ఉమా ఆర్‌ కాటికి, మహిళా సేవల కోఆర్డినేటర్‌గా సోహిని అయినాల, అంతర్జాతీయ కోఆర్డినేటర్‌గా ఠాగూర్‌ మల్లినేని, కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌గా సతీశ్ కొమ్మన, స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌గా నాగ పంచుమూర్తి, ఫౌండేషన్‌ ట్రస్టీలుగా రామకృష్ణ అల్లు, భక్త బల్లా, శ్రీనివాస్‌ కూకట్ల, రాజా సూరపనేని, ఎండూరి శ్రీనివాస్‌ గెలుపొందారు. ఎన్నికల్లో అన్ని పదవులను కైవసం చేసుకోవడంతో నరేశ్‌ ప్యానెల్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈసారి అందరం కలిసి పనిచేద్దామని.. విదేశాల్లో తెలుగు వారి పరువు పొగొట్టేలా వ్యవహరించకూడదని నరేన్‌ వర్గం భావిస్తోంది. గెలుపోటములు పక్కనపెట్టి తెలుగు వారి కోసం కృషి చేద్దామని ప్యానెల్‌ నిర్ణయించింది.

ఇది వివాదం
రెండు సంవత్సరాలుగా తానాలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతర్గత సమస్యలు, న్యాయ వివాదాల్లో తానా చిక్కుకుంది. ఒకసారి ఎన్నికలు కూడా రద్దయ్యాయి. మళ్లీ ఎన్నికలు జరిగాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో పూర్తిస్థాయి కార్యవర్గాలు ఏర్పడడంతో తానా ఊపిరి పీల్చుకుంది. ఓ వర్గం మితిమీరిన ప్రవర్తనతో తానాలో వివాదం ఏర్పడింది. రద్దయిన ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న గోనినేని శ్రీనివాస్‌ అనూహ్యంగా నరేన్‌కు మద్దతివ్వడం ఆసక్తికరం. ఈసారి అన్ని వర్గాలు కలిసి ప్రశాంతంగా ఎన్నికలు జరగడంతో తానా సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Lord Sri Ram Idol: అయోధ్య విగ్రహం.. రామయ్య నీరూపం చూడడానికి రెండు కళ్లు చాలవయ్యా

Also Read: Ram Mandir: అయోధ్యకు ప్రభాస్ 50 కోట్ల విరాళం…క్లారిటీ ఇచ్చిన టీమ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News