Ram Lallah Idol: అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో శ్రీరాముడు కొలువుదీరడానికి సిద్ధమయ్యాడు. ప్రత్యేక శిలతో తయారుచేసిన రాముడి దివ్యరూపం భక్త లోకానికి దర్శనమిచ్చింది. గర్భగుడిలో ప్రతిష్టించే రాములోరి విగ్రహం ముసుగు తీశారు. బాలరాముడి విగ్రహం ఫొటోలు బయటకు రావడంతో భక్తులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ సందర్భంగా విగ్రహం విశేషాలు తెలుసుకుంటున్నారు. గర్భగుడిలో ప్రతిష్టించిన విగ్రహం కృష్ణశిలతో తయారుచేశారు. ఆ దివ్యరూపం ప్రత్యేకంగా రూపొందించారు.
కమలం పువ్వుపై రాముడి నిలబడి దర్శనమిస్తున్నాడు. ఒక చేతిలో విల్లు, ఒక చేతిలో బాణం ధరించి ఉన్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. అంటే దాదాపు నాలుగు అడుగులు ఉంటుంది. మూడు విగ్రహాలు తయారుచేయగా.. వాటిలో కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహామే ఆలయంలో ప్రతిష్టించారు. విగ్రహం ఎంతో అందంగా.. చూస్తుంటే చూడబుద్ధయ్యేలా ఉండడం విశేషం. భక్తులను తన్మయత్వానికి గురి చేస్తోంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా విగ్రహం రూపొందించడంతో భక్తులు అయోధ్యను సందర్శించేందుకు సిద్ధమయ్యారు. కాగా శిల్పులు తయారుచేసిన మిగతా రెండు విగ్రహాలను కూడా ఆలయంలోని రెండు, మూడో అంతస్తుల్లో ప్రతిష్టించనున్నారు.
అయోధ్యలో మొత్తం 70 ఎకరాల్లో ఆలయం నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆలయంలో భక్తులు తూర్పు వైపు నుంచి ఆలయంలోకి ప్రవేశించి రాముడిని దర్శించుకుని దక్షిణం వైపు నుంచి బయటకు వస్తారు. సూర్యాకృతిని కలిగి ఆలయ నిర్మాణం ఉంటుంది. కాగా, ఆలయ ప్రాణప్రతిష్ట ఉత్సవానికి కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా ఈనెల 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించింది. ఇక ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు ఆ రోజు సెలవు ప్రకటించాయి.
ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి అతిరథ మహారథులు తరలివస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వారికి ఆహ్వానాలు పంపారు. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతోపాటు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు తరలివస్తున్నారు. వీవీఐపీల పర్యటనతో అయోధ్యను భద్రత బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి ప్రాణప్రతిష్ట ఉత్సవాన్ని శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఎస్పీజీ, సీఆర్పీఎఫ్, ఇతర బలగాలు అయోధ్యకు చేరుకున్నాయి. మొత్తానికి ఈనెల 22న దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం సంతరించుకోనుంది.
Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
Also Read: Boat Accident: గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం 16 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter