NRI News: యూఏఈ లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు

యూఏఈ ( UAE) పెరుగుతున్న కరోనావైరస్ కేసులు. అయితే యాక్టీవ్ కేసుల సంఖ్య మాత్రం రోజు రోజు కూ తగ్గుతోంది. 

Last Updated : Aug 29, 2020, 11:34 PM IST
    • యూఏఈ పెరుగుతున్న కరోనావైరస్ కేసులు.
    • అయితే యాక్టీవ్ కేసుల సంఖ్య మాత్రం రోజు రోజు కూ తగ్గుతోంది.
    • అయితే తాజా గణాంకాల ప్రకారం కోవిడ్-19 వైరస్ కేసులు పెరుగున్నట్టు తెలుస్తోంది.
NRI News: యూఏఈ లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు

యూఏఈ ( UAE) పెరుగుతున్న కరోనావైరస్ కేసులు. అయితే యాక్టీవ్ కేసుల సంఖ్య మాత్రం రోజు రోజు కూ తగ్గుతోంది. అయితే తాజా గణాంకాల ప్రకారం కోవిడ్-19 వైరస్ కేసులు పెరుగున్నట్టు తెలుస్తోంది. ఒక రోజు ముందు 390 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. అదే సమయంలో 389 మంది ఒక రోజు కోలుకున్నట్టు సమాచారం. ఇందులో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. 

వీటితో కలిసి ఇప్పటి వరకు యూఏఈలో 68,901 కోవిడ్-19 (  covid-19 ) కేసులు నమోదు అయ్యాయి.

వీరిలో 59,891 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోవిడ్-19 వల్ల యూఏఈలో 379 మంది మరణించారు.

కేసులు మళ్లీ పెరుతుండటం గమనించిన యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని శాఖలను అప్రమత్తం చేసింది.  యూఏఈ లో ఉంటున్న ఈ దేశ పౌరులు, విదేశీయులు తప్పని సరిగా ప్రభుత్వ నియమాలు పాటించి కోవిడ్-19 ను అరికట్డడంలో సహకరించాలని కోరింది.

 

Trending News