7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరింత ఆలస్యం

7th Pay Commission Big Update | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్(Dearness Allowance) పెంపు కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. డీఏ పెంపు నిర్ణయం మరోసారి వాయిదా పడింది. జేసీఎం కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వం జూన్ 2021లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే 4 శాతం మేర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగనుందని రిపోర్టులు చెబుతున్నాయి.

1 /5

7th Pay Commission Latest News | యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు గత ఏడాదిన్నర కాలం నుంచి తమ డియర్‌నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు మరికొంత కాలం నిరీక్షించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

2 /5

7th Pay Commission Big Update | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్(Dearness Allowance) పెంపు కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. డీఏ పెంపు నిర్ణయం మరోసారి వాయిదా పడింది. జేసీఎం కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వం జూన్ 2021లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే 4 శాతం మేర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగనుందని రిపోర్టులు చెబుతున్నాయి.

3 /5

శివ గోపాల్ మిశ్రా, ఉద్యోగుల తరఫు కార్యదర్శి మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆర్థికశాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ డీఏ పెంపు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు చెప్పారు. వాస్తవానికి ఏప్రిల్ నెలలో లేదా మే తొలి అర్ధభాగం సమయంలోపే నిర్ణయం తీసుకుంటారు.

4 /5

7వ వేతన సవరణ సంఘం, జేసీఎం నేషనల్ కౌన్సిల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగులకు రావాల్సిన కొత్త అలవెన్స్, సవరించిన వేతనాలను గత ఏడాది తొలిసారిగా నిలిపివేశారు. కానీ ప్రస్తుతం వీరికి మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసిందే. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిపై స్పష్టత ఇచ్చారు. జూలై 1వ నుంచి ఉద్యోగులకు బకాయిలు, సవరించాల్సిన అలవెన్సులు అందుతాయని కొత్త వేతనాలలో అందుతాయని పేర్కొన్నారు.

5 /5

ఒకేసారి 3 పెండింగ్ డీఏలు 1 జనవరి 2020 నుంచి 30 జూన్ 2020, 1 జూలై 2020 నుంచి 31 డిసెంబర్ 2020 వరకు రెండో డీఏ, 1 జవనరి 2021 నుంచి జూన్ 30 వరకు మూడో డీఏ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే ఒకే దఫాలో ఉద్యోగులకు డీఏ ఇవ్వలేని పక్షంలో విడుతల వారీగా అయినా చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగుల తరఫు కార్యదర్శులు తమ అభిప్రాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులకు సూచించారు.