Karnataka Elections: ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు కృషి.. వీధుల్లో వినూత్న కార్యక్రమాలు

Karnataka Assembly Elections 2023: కర్ణాటక ఎన్నికల పోలింగ్ మే 10న జరగనున్నాయి. మే 13వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు.  
 

1 /5

సిద్దాపూర్ గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో హిన్నాలె ఇంచార జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో ఓటింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వీధి నాటక ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో ప్రజలు క్యూలో నిలబడి ఓటు వేస్తామని హామీ ఇచ్చేందుకు ఒకరి తర్వాత ఒకరు సంతకాలపై సంతకాలు చేశారు.

2 /5

గ్రామంలోని ప్రధాన వీధుల్లో పర్యటించి ఓటింగ్‌కు సంబంధించిన పాటలు పాడుతూ అవగాహన కల్పించారు. అధికారులు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, సహాయక సంఘాల సభ్యులు జోరుగా నినాదాలు చేస్తూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.  

3 /5

సిద్దాపూర్ గ్రామపంచాయతీ మోడల్ పోలింగ్ బూత్-149లో జాగృతి ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. వీధుల్లో పర్యటించారు.  

4 /5

కుష్టగి తాలూకా చలగేరి గ్రామంలో భారీ ఓటింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వీప్ కమిటీ చైర్మన్, కార్యనిర్వాహక అధికారులు హనుమంత గౌడ పాటిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

5 /5

బేవూరు గ్రామంలోని ప్రతి వార్డులో పంచాయతీ కార్యనిర్వహణాధికారుల ఆధ్వర్యంలో గ్రామంలోని ఓటర్లు ‘తప్పకుండా ఓటు వేయండి.. మా ఓటు మా హక్కు’ అంటూ నినాదాలు చేశారు.