Pregnant Woman Tips: సమ్మర్ లో గర్భిణీలు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి..

Pregnant Woman Tips: మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.  ఈసమయంలో పాటించాల్సిన డైట్, ఎక్సర్ సైజ్, ఒత్తిడిలేకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

1 /7

మహిళలకు ప్రెగ్నెంట్ సమయంలో ఎంతో కేరింగ్ ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ప్రెగ్నెన్సీని చాలా మంది పునర్జన్మ అని కూడ చెబుతుంటారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి బేబీ పుట్టడం వరకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే పుట్టబోయే బిడ్డ హెల్దీగా పుడుతుందని చెబుతుంటారు.

2 /7

ప్రెగ్నెంట్ లేడీస్ కు సమ్మర్ సీజన్ అనేది పెద్ద సమస్యగా ఉంటుదని చెప్పుకొవచ్చు. సమ్మర్ లో రోజు పెద్దదిగా ఉంటుంది. అదే విధంగా ఎండలు మండిపోతుంటాయి. చాలా మందిలో బాడీ డీహైడ్రేషన్ కు గురౌతుంటుంది.  ఒక్కసారిగా మహిళలకు నీరసానికి కూడా గురౌతుంటారు.

3 /7

గర్భిణీ మహిళలు ముఖ్యంగా వాంతులతో ఎక్కువగా బాధపడుతుంటారు. అందుకు ప్రెగ్నెంట్ సమయంలో మంచి ఫుడ్ ను తీసుకొవాలి. ప్రతిరోజు ఉదయాన్నే డ్రైఫ్రూట్స్ లను ఎక్కువగా తినాలి. పెసర్లు, చెనగలు నీటిలో నానబెట్టుకుని, మొలకెత్తిన తర్వాత తినాలి.

4 /7

సమ్మర్ లో ఎక్కువగా జిమ్ లకు, ఎక్సర్ సైజ్ లకు దూరంగా ఉండాలి. సమ్మర్ ప్రభావం వల్ల బాడీ  అంతా డీహైడ్రేషన్ కు గురి అవుతుంటుంది. ఉదయం పూట బైటకు వెళ్లకుండా ఉండాలి. ఎర్లీమార్నింగ్ కాసేపు డీ విటమిన్ కోసం మాత్రమే ఎండలో ఉండాలి. నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి.  

5 /7

ఇంట్లో చిన్న చిన్నపనులు చేసుకొవడానికి అవకాశం ఉన్నవారు చేసుకొవచ్చు. అంతేకానీ.. బరువులు ఎత్తడం, కిందకు వంగడం వంటి పనులకు దూరంగా ఉండాలి.. ఒత్తిడికి గురయ్యే విషయాలకు దూరంగా ఉండాలి.  

6 /7

ఎల్లప్పుడు మనస్సుకు  ఉత్సాహంగా, ఆహ్లదంగా అనిపించే పనులను మాత్రమే చేయాలి. ముఖ్యంగా టిఫిన్ లు, లంచ్, డిన్నర్ లను అస్సలు స్కిప్ చేయకూడదు. డాక్టర్ సూచనల ప్రకారం ప్రాపరర్ డైట్ ను ఫాలో అవ్వాలి.

7 /7

గర్భిణీలు రోజుకు 8 గంటల పాటు పడుకోవాలి. మధ్యాహ్నం అలసటగా అన్పిస్తే పడుకోవడం వల్ల బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. పడుకున్న సమయంలో కాళ్లను ఎత్తులో పెట్టుకుని కాళ్లకింద దిండులను పెట్టుకొవాలి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)