Rasi Phalalu: ఈ రాశులవారిపై అంగారకుడి ఎఫెక్ట్‌..డిసెంబర్ 27 నుంచి లాభాలే లాభాలు..డబ్బులే డబ్బులు..

Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంగారక గ్రహం డిసెంబర్ చివరి వారంలో సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో శుభ సమయం ఏర్పడబోతోంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు.

  • Dec 19, 2023, 12:01 PM IST

 


Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రంలో అంగారక గ్రహాన్ని అన్ని గ్రహాలకు గురువుగా భావిస్తారు. కాబట్టి ఈ గ్రహ సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ అంగారక గ్రహం సంచారం చేసినప్పుడు వ్యక్తుల జాతకాల్లో శుభ స్థానంలో ఉంటే కష్టాలన్నీ తొలగిపోయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. అయితే చాలా రోజుల తర్వాత ఈ అంగారక గ్రహం రాశి సంచారం చేయబోతోంది.

1 /4

అంగారక గ్రహం ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ 27వ తేదీన రాత్రి 11.40 గంటలకు ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే అంగారక గ్రహ సంచారం కారణంగా ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.

2 /4

అంగారకుడు ధనస్సు రాశిలోకి సంచారం చేయడం కారణంగా మేష రాశి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇక వ్యాపారాలు చేసే వారికి ఊహించని ఆర్థిక లాభాలు కలగబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతోపాటు కొన్ని ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి   

3 /4

తులా రాశి వారికి అంగారకుడి సంచారం కారణంగా పూజల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. ఇదే సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రేమ జీవితం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.  

4 /4

అంగారకుడి సంచారంతో వృశ్చికరాశి వారి జీవితంలో కూడా అనేక మార్పులు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు కొన్ని అనుకోని శుభవార్తలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి ఇక ఇంతకుముందు ఉన్న ఆర్థిక పరిస్థితుల కంటే ఈ సమయంలో చాలా మార్పులు వస్తాయి ఉద్యోగం చేసేవారు పదోన్నతులు కూడా పొందుతారు.