OnePlus 5G Phone Vs Redmi 5G Phone: రూ. 20 వేల లోపు 5G ఫోన్లలో ఈ రెండు బెస్ట్ ఫోన్లలో ఏది బెటర్

OnePlus Nord CE 3 Lite 5G mobile Vs Redmi Note 12 5G mobile: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌లో యాపిల్ తరువాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న వన్‌ప్లస్ తాజాగా తమ కంపెనీ నుంచి ఇండియన్ కస్టమర్స్ కోసం ఏప్రిల్ 4న బడ్జెట్ ఫోన్ OnePlus Nord CE 3 Lite 5G ని లాంచ్ చేసింది. వన్‌ప్లస్ లైనప్‌లో కొత్తగా యాడ్ అయిన ఈ ఫోన్.. అదే సెగ్మెంట్‌లో ఉన్న Redmi Note 12 5G ఫోన్‌తో పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రకాల ఫోన్ల మధ్య వ్యత్యాసాలు ఏంటో ఓ స్మాల్ లుక్కేద్దాం రండి.

  • Apr 05, 2023, 22:15 PM IST

OnePlus Nord CE 3 Lite 5G mobile Vs Redmi Note 12 5G mobile: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5G ఫోన్లలో 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 గా ఉండగా.. 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999 గా ఉంది. రెడ్‌మి నోట్ 12 5G ఫోన్ ధర రూ.17,999 గా ఉంది.

1 /6

OnePlus Nord CE 3 Lite 5G mobile Vs Redmi Note 12 5G mobile: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5G ఫోన్లలో 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 గా ఉండగా.. 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999 గా ఉంది. రెడ్‌మి నోట్ 12 5G ఫోన్ ధర రూ.17,999 గా ఉంది.

2 /6

OnePlus Nord CE 3 Lite 5G mobile Vs Redmi Note 12 5G mobile: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5G 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.72 అంగుళాల స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 12 5G గరిష్టంగా 120hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను అమర్చారు.

3 /6

OnePlus Nord CE 3 Lite 5G mobile Vs Redmi Note 12 5G mobile: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5G ఫోన్ క్రోమాటిక్ గ్రే, పాస్టెల్ లైమ్ అని రెండు వేర్వేరు కలర్లలో అందుబాటులోకి వస్తోంది. రెడ్‌మి నోట్ 12 5G ఫ్రాస్టెడ్ గ్రీన్, మ్యాట్ బ్లాక్, మిస్టిక్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

4 /6

OnePlus Nord CE 3 Lite 5G mobile Vs Redmi Note 12 5G mobile: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5G కెమెరా విషయానికొస్తే.. 108MP, 2MP, 2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తోంది. రెడ్‌మి నోట్ 12 5G ఫోన్ మెయిన్ కెమెరా విషయానికొస్తే.. 48MP కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలతో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ముందు భాగంలో అందమైన సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరాను కూడా అమర్చారు.

5 /6

OnePlus Nord CE 3 Lite 5G mobile Vs Redmi Note 12 5G mobile: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5G 5000 mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీతో లభిస్తోంది. రెడ్‌మి నోట్ 12 5G 33W మ్యాగ్జిమం ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh సైజ్ లి పాలిమర్ బ్యాటరీ కలిగి ఉంది.

6 /6

OnePlus Nord CE 3 Lite 5G mobile Vs Redmi Note 12 5G mobile: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5G ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఆక్సీజన్ ఓఎస్ ఆధారంగా రన్ అవుతుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగాన్  695 5G ఆధారంగా రన్ అవుతుంది. Redmi Note 12 5G MIUI 13, ఆండ్రాయిడ్ 12ని 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీతో లభిస్తోంది.