EPFO: పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎప్పుడు జమకానుందో తెలుసా?

  • Dec 18, 2020, 09:02 AM IST

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి పలు సేవలు పొందుతున్నారు. మన జీతం నుంచి ప్రతినెలా కొంత డబ్బు ఈపీఎఫ్ అకౌంట్‌లోకి జమ అవుతుంది. అదే విధంగా యాజమాన్యాలు సైతం అంతే మొత్తం నగదును ప్రతినెలా మన ఈఫీఎఫ్ ఖాతాలోకి జమ చేస్తాయని తెలిసిందే.

Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి

1 /5

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి పలు సేవలు పొందుతున్నారు. మన జీతం నుంచి ప్రతినెలా కొంత డబ్బు ఈపీఎఫ్ అకౌంట్‌లోకి జమ అవుతుంది. అదే విధంగా యాజమాన్యాలు సైతం అంతే మొత్తం నగదును ప్రతినెలా మన ఈఫీఎఫ్ ఖాతాలోకి జమ చేస్తాయని తెలిసిందే.

2 /5

ఈపీఎఫ్ (EPF) అకౌంట్ ద్వారా ఉద్యోగులకు పలు ప్రయోజనాలున్నాయి డబ్బు జమ అవుతుంది, వడ్డీ, పెన్షన్, ఇన్సురెన్స్ లాంటి ఎన్నో సౌకర్యాలను పీఎఫ్ ఖాతాదారులు పొందుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు ఆలోచిస్తున్న అంశం ఈపీఎఫ్ ఖాతాలపై వడ్డీ ఎంతమేర, ఎప్పుడు వస్తుంది.

3 /5

ఈపీఎఫ్ ఖాతాల్లోకి 8.5శాతం వడ్డీ మరికొన్ని రోజుల్లో జమ కానుంది. అయితే 2019-20 ఏడాదికిగానూ ఖాతాదారులకు రావాల్సిన వడ్డీ డిసెంబర్ 31లోగా ఈపీఎఫ్ ఖాతాల్లోకి చేరనుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల 6 కోట్లకు పైగా ఖాతాదారులకు లబ్దిచేకూరనుంది.  Also Read: Salary Reduce from 2021: వచ్చే ఏడాది మీ జీతం తగ్గవచ్చు.. ఎందుకో తెలుసా!

4 /5

మొదట రెండు దఫాలుగా వడ్డీని ఈఫీఎఫ్ ఖాతాల్లో జమచేయాలని 8.15 శాతం మొదటి విడుత, 0.35 శాతం రెండో విడుతలో అందిస్తామని చెప్పారు. అయితే నిర్ణయాన్ని మార్చుకుని మొత్తం వడ్డీ 8.5శాతం ఒకేసారి ఈపీఎఫ్ ఖాతాదారులకు అందిస్తామని ఈపీఎఫ్ఓ పేర్కొంది. మీ వడ్డీ వివరాలు, ఈపీఎఫ్ ఖాతా వివరాలు తెలుసుకోవాలంటే అధికారిక సైట్‌లో చూసుకోవాలి. Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

5 /5

కొందరు ఉద్యోగులు జాబ్ మారుతున్న సమయంలో ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు విత్‌డ్రా చేస్తుంటారు. వాస్తవానికి ఉద్యోగం మారినంత మాత్రానా ఈపీఎఫ్ (EPF) డబ్బులు చేయాలన్న రూల్ ఏం లేదు. ఉద్యోగి కొత్త కంపెనీ, సంస్థకు మారినా పాత ఈపీఎఫ్ అకౌంట్‌ను అలాగే కొనసాగించవచ్చు. Also Read: EPFO: పీఎఫ్ నగదు విత్‌డ్రా చేస్తున్నారా.. ఈ తప్పులు అసలు చేయవద్దు!