Constable Beaten: కానిస్టేబుల్ ను చితక్కొట్టిన జనం.. అసలు ఏమైందంటే?

Constable Beaten at Anand Vihar Police Station: ఢిల్లీలో కొందరు  ఓ పోలీసు అధికారిని కొట్టి, మొబైల్‌తో షూట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2022, 04:37 PM IST
  Constable Beaten: కానిస్టేబుల్ ను చితక్కొట్టిన జనం.. అసలు ఏమైందంటే?

Constable Beaten at Anand Vihar Police Station: ఢిల్లీలో కొందరు వ్యక్తులు ఓ పోలీసు అధికారిని కొట్టి, మొబైల్‌తో షూట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. 10-12 మంది కలిసి పోలీసును చుట్టుముట్టడం అలాగే వారిని కొట్టడం, ఆ కొడుతున్న సమయంలో మొబైల్ కెమెరాలలో రికార్డ్ చేయడం వైరల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోలో దాడికి గురైన పోలీసు తూర్పు ఢిల్లీలోని ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌ అని అంటున్నారు. అయితే, ఈ వైరల్ వీడియోలో పోలీసు అధికారిపై ఎందుకు దాడి చేస్తున్నారో స్పష్టంగా తెలియలేదు.

అయితే పోలీసు అధికారి వారికి పదేపదే క్షమాపణలు చెప్పడం చూడవచ్చు, కాని వారు ఆయనని కొట్టడం ఆపలేదు. షాహదారా జిల్లా ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొడవ విషయంలో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోండగా అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఓ యువకుడిని చెప్పుతో కొట్టాడని అంటున్నారు. దీంతో అక్కడికి వచ్చిన మిగతా వారికి కోపమొచ్చింది. దీంతో ఆ కానిస్టేబుల్‌ను తీవ్రంగా కొట్టారని అంటున్నారు. ఈ సమయంలో, మిగతా పోలీసులు ఎవరూ తమ కొలీగ్ ను రక్షించడానికి ప్రయత్నించలేదు.

ఈ ఘటన జరిగిన సమయంలో కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటన జూలై 30వ తేదీన జరగ్గా ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్కర్‌దూమా గ్రామంలో ఇద్దరు ఇరుగుపొరుగు వారి మధ్య గొడవ జరిగిందని, దీంతో ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ దుర్భాషలాడుకున్నారని తెలుస్తోంది.

విషయం తీవ్రస్థాయికి చేరడంతో విషయం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఇరువర్గాలు అప్పుడే పోలీసు స్టేషన్‌కు చేరుకుకోగా ఒక కానిస్టేబుల్ పెట్రోలింగ్ తర్వాత అక్కడికి చేరుకున్నాడు. అక్కడ నిలబడిన వారిని ఎందుకు వచ్చారని అడగడమే కాక కానిస్టేబుల్‌ ఓ వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. అంతేకాక చెప్పుతో కొట్టారని అంటున్నారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వారికి కోపమొచ్చింది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్‌ను పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనను పలువురు వీడియోలు షూట్ చేసి వైరల్‌గా మర్చారు. 

Also Read: Samsung Cystal Smart TV: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీపై రూ.20 వేలు తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాకపోవచ్చు

Also Read: Roja On Gorantla: ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News