Smart TVs for Low Price: ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలు అతి చౌక ధరకే అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, వన్ ప్లస్, సోనీ, థామ్సన్ తదితర బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు అందిస్తోంది. పలు టీవీలపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రిటైల్ స్టోర్స్‌లో ధరలతో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్‌లో డెడ్ చీప్‌గా బ్రాండ్ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ క్రిస్టల్ 4కె నియో సిరీస్ (43 అంగుళాలు) స్మార్ట్ టీవీ సగం కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
అసలు ధర ఎంత.. ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ఎంత..
శాంసంగ్ క్రిస్టల్ 4కె నియో సిరీస్ (43 అంగుళాలు) స్మార్ట్ టీవీ అసలు ధర రూ.47,900. ఫ్లిప్‌కార్ట్ దీనిపై 29 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా రూ.13,910 వరకు ఆదా అవుతుంది. డిస్కౌంట్ పోను కేవలం రూ.33,990కే ఈ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపినట్లయితే మరో రూ.1500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా మరింత చౌకగా రూ.32,490కే ఈ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీపై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.
ఎక్స్‌చేంజ్ ద్వారా రూ.11 వేలు తగ్గింపు :
శాంసంగ్ క్రిస్టల్ 4కె నియో సిరీస్ (43 అంగుళాలు) స్మార్ట్ టీవీపై ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో రూ.11 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ కోసం మీరిచ్చే స్మార్ట్ టీవీ కండిషన్‌ను బట్టే ధర వర్తిస్తుందని గుర్తుంచుకోండి. ఒకవేళ పూర్తి తగ్గింపు లభించినట్లయితే రూ.33,990కి అందుబాటులో శాంసంగ్ క్రిస్టల్ 4కె నియో స్మార్ట్ టీవీని కేవలం రూ.22,990కే సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్‌తో కలిపి మొత్తం రూ.20 వేలు వరకు తగ్గింపు పొందవచ్చు.
శాంసంగ్ క్రిస్టల్ 4కె నియో సిరీస్ (43 అంగుళాలు) ఫీచర్స్ :
- సపోర్టెడ్ యాప్స్ : నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్
- ఆపరేటింగ్ సిస్టమ్ : టైజెన్
- రిజల్యూషన్ : అల్ట్రా హెచ్డీ (4కె) క్రిస్టల్ 4కె
- సౌండ్ : 20 వాట్స్
- రిఫ్రెష్ రేట్ : 50 హెచ్‌జెడ్
- Also Read: Samsung Smart TV: బెస్ట్ బ్రాండ్, బెస్ట్ ఫీచర్స్.. 32 అంగుళాల శాంసంగ్ స్మార్ట్ టీవీ సగం కన్నా తక్కువ ధరకే..
Also Read: Flipkart OnePlus Y1 TV: వన్‌ప్లస్ వై1 టీవీపై రూ. 6500 తగ్గింపు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook