Apps banned in China: గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్ సహా చైనాలో ఇవన్నీ నిషేధమే

Banned apps in China: చైనా యాప్స్‌పై భారత్ నిషేధం విధిస్తే.. చైనా గగ్గోలు పెడుతోంది. టిక్‌టాక్‌ యాప్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్, హెలో లాంటి 59 మొబైల్ యాప్స్‌పై భారత్ నిషేధించడంపై చైనా ఆందోళన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. కానీ చైనాలో ఇతర దేశాలకు చెందిన యాప్స్‌పై నిషేధం విధించడం మాత్రం వాళ్లకు కొత్తేం కాదు. ప్రపంచం మెచ్చిన ఎన్నో మొబైల్ యాప్స్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వెబ్‌సైట్స్‌ని చైనా ఎప్పుడో నిషేధించింది.

Last Updated : Jul 6, 2020, 11:46 PM IST
Apps banned in China: గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్ సహా చైనాలో ఇవన్నీ నిషేధమే

Banned apps in China: చైనా యాప్స్‌పై భారత్ నిషేధం విధిస్తే.. చైనా గగ్గోలు పెడుతోంది. టిక్‌టాక్‌ యాప్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్, హెలో లాంటి 59 మొబైల్ యాప్స్‌పై భారత్ నిషేధించడంపై చైనా ఆందోళన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. కానీ చైనాలో ఇతర దేశాలకు చెందిన యాప్స్‌పై నిషేధం విధించడం మాత్రం వాళ్లకు కొత్తేం కాదు. ప్రపంచం మెచ్చిన ఎన్నో మొబైల్ యాప్స్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వెబ్‌సైట్స్‌ని చైనా నిషేధించడమే కాకుండా ( Apps blocked in China ).. వాటి స్థానంలో వాటికి పోటీగా స్వదేశీ యాప్స్‌కి మాత్రం అనుమతి ఇవ్వడం గమనార్హం. అవును.. గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, జీ మెయిల్.. ఇలా లిస్టు చదువుతూపోతే ప్రపంచం అంతా దాసోహం అంటోన్న సోషల్ మీడియా యాప్స్,  వెబ్‌సైట్స్ ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ చైనాలో పనిచేయవు అనే సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ( Also read: Moj app: TikTok కి ప్రత్యామ్నాయంగా మరో యాప్ లాంచ్ చేసిన ShareChat )

ప్రపంచంలో గూగుల్ అంటే తెలియని వాళ్లుండరు. కానీ చైనాలో గూగుల్ ( Google in China ) పని చేయదు. యావత్ ప్రపంచాన్ని ఒక్క చోట చేర్చుతున్న ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, జీ మెయిల్ లాంటి యాప్స్‌కి ప్రపంచం ఎప్పుడో గులాం అయిపోయింది. కానీ చైనా ఈ యాప్స్ పప్పులు ఉడకవు.. ఎందుకంటే అక్కడ వీటిపై నిషేధం అమలులో ఉంది కనుక. అంతేకాదు.. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ యాప్స్ అన్నింటికీ అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన వేర్వేరు యాప్స్, ఇతర వెబ్‌సైట్స్ ఉన్నాయి. ( Also read: Tik Tok, UC Browser: టిక్‌ టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం )

చైనాలో గూగుల్ స్థానంలో బైదు ( Baidu ) అనే సెర్చ్ ఇంజిన్ ఉపయోగిస్తారు. అక్కడ అదే ఫేమస్. ఫేస్‌బుక్‌కి బదులుగా వీచాట్ ( WeChat ) .. ట్విటర్‌కి బదులుగా చైనాలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ వీబో ( Weibo App ) ఉంది. ఇందులో ఇదివరకు మన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఖాతా ఉండేది. అయితే భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల ( India vs China face off ) నేపథ్యంలో ఆయన ఆ ఖాతాను డిలీట్ చేయించారు. ( Also read: Chinese apps banned: చైనా యాప్స్‌ నిషేధం.. స్పందించిన చైనా సర్కార్ )

వినోదంతో కూడిన వీడియోలకు వేదికైన యూట్యూబ్‌కి చైనాలో స్థానం లేదు ( Youtube banned in China ). అక్కడ యూట్యూబ్‌ స్థానంలో యూకో.కామ్ ఫేమస్. చైనాకే చెందిన అలీబాబా, టెన్సెంట్ వీడియో యాప్ సంస్థలకు అనుబంధ సంస్థ అయిన యూకో.కామ్‌కు ( Youko.com ) చైనాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  ( Also read: PM Modi`s Ladakh visit: ప్రధాని లఢక్ పర్యటనపై స్పందించిన చైనా )

ఫేస్‌బుక్ లాగే.. అదే సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా చైనాలో స్థానం లేదు. చైనాలో ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి యాప్స్‌లో ఉన్న ఫీచర్స్ అన్నింటిని ఒకేదాంట్లో ఇమిడిపోయేలా చేస్తూ వీచాట్ యాప్ ( Wechat in China ) అందుబాటులో ఉంది. 

ఎన్నో ప్రపంచ దేశాలు ఉపయోగిస్తున్న ఈ మెయిల్ సర్వీస్ జీ మెయిల్‌పై చైనాలో నిషేధం ( G Mail in China ) అమలులో ఉంది. 

వాట్సాప్ యాప్ ( Whatsapp in China ) కూడా చైనా నిషేధం విధించింది. వాట్సాప్ స్థానంలో చైనావాళ్లు క్యూక్యూ ( QQ app in China) ఉపయోగిస్తారు. 

Trending News