Top 10 Billionaires countries in World: ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2026 ప్రకారం, వరల్డ్ వైడ్ గా 3,428 మంది బిలియనీర్లు ఉన్నారు. 2025లో ఈ సంఖ్య 3,028గా ఉంది. తాజాగా వీరిందరి సంపద కలిపితే 20.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన టాప్ 10 దేశాల జాబితా ఇక్కడ ఉంది. అందులో భారత దేశం స్థానం విషయానికొస్తే..
Farming of Snakes: సాధారణంగా వ్యాపారం అంటే లాభం సంపాదించాలన్న ఉద్దేశంతో.. ప్రజల అవసరాలను తీర్చేందుకు వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయడం, కొనడం, అమ్మడం, లేదా అందించడం. ఇది ఒక ఆర్థిక కార్యకలాపం వంటిది. ఇక్కడ పెట్టుబడి నిరంతర నిర్వహణ నష్ట భయం ఉంటుంది. చిన్న కిరాణా దుకాణం నుండి పెద్ద కార్పొరేట్ కంపెనీల వరకు అన్ని వ్యాపారాలే.
Russia Gold Plan: రష్యా వద్ద ప్రస్తుతం 2,000 టన్నులకు పైగా భారీ బంగారు నిల్వలు ఉన్నాయి. అయితే.. గత 25 ఏళ్లలో మొదటిసారిగా రష్యా తన సెంట్రల్ బ్యాంక్ నుండి బంగారాన్ని ఉపసంహరించి విక్రయిస్తోంది. ఉక్రెయిన్‌తో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం.. దానికి తోడు ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల చమురు ఆదాయం తగ్గడం రష్యాను ఈ నిర్ణయం దిశగా నడిపించాయి. కేవలం రెండు నెలల్లోనే రష్యా 14 టన్నుల బంగారాన్ని అమ్మేసింది.
Golden Duck Good Luck To Farmer 10 Gram Gold Found Inside Duck Stomach: లాభదాయకమైన వృతి.. ఉద్యోగం ఉంటే వారిది బంగారు బాతులాంటి జీవితం అని అంటారు. బంగారు బాతు అనేది ఒక నానుడిగా చలామణీలో ఉంది. అయితే ఇకపై అది నానుడి కాదు నిజమని నిరూపించింది. ఓ బాతును కోస్తే అందులో నుంచి బంగారం బయటపడింది. ఆ వివరాలు ఇలా ఉన్నారు.
Iran - US- Iran War: పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం నానాటికీ పెరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఆరో రోజు ఇరాన్ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడ్డాయి. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై పలు దఫాలుగా తీవ్ర స్థాయిలో దాడులు కొనసాగించింది. పలు గల్ఫ్ దేశాలపైనా ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. ఇరు పక్షాలూ నౌకలు, నౌకాశ్రయాలను లక్ష్యంగా చేసుకున్నాయి.
US - Iran - Israel War: ఇరాన్ వర్సెస్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం మరింత ఉధృతంగా కొనసాగుతోంది. దాదాపు ఆరు రోజులుగా యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇంకా ఈ యుద్ధం కారణంగా ఈ మూడు దేశాలకు సంబంధించిన సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా వణికి పోతున్నాయి.
US- Israel - Iran War: ఇరాన్ పై యుద్ధంతో గొప్ప దేశంగా నిలవాలని ఇజ్రాయెల్ పరితపిస్తోంది. యుద్ధానికి ఉసిగొల్పిన అమెరికా ఏకధ్రువ ఆదిపత్యాన్ని నిలబెట్టుకోవాలని ఆరాటపడుతోంది. లక్ష్యానుసారం బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ తొలిరోజే విజయం సాధించామని ప్రకటించింది. ఇరాన్ ప్రతిదాడులతో విరుచుకుపడింది. అమెరికా ఎంబసీ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. అనూహ్యంగా తలెత్తిన యుద్ధంపై ప్రపంచదేశాలు ఆందోళనకు గురయ్యాయి. ఇరాన్ పై యుద్ధం సరికాదని చైనా, రష్యా దేశాలు ఖండించాయి. నిన్నమొన్నటిదాకా ఖండించిన చైనా... ఇపుడు ప్రత్యక్ష పాత్ర పోషించేందుకు వెనుకాడటం లేదు. యుద్ధంలోకి చైనా ఎంట్రీతో మొత్తం యుద్ధ వ్యూహం మారిపోబతుందా..
Humanoid Robots Viral Video: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ ద్వారా అబ్బురపరిచే రీతిలో ఆవిష్కరణలు కనుగొంటున్నారు. ఇక AI రాకతో టెక్నాలజీ మరింతగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు ఏఐ వాడకం నెక్ట్స్ లెవెల్ కి చేరిందని చెప్పాలి. AI అభివృద్ధి చెందుతూనే ఉండటంతో రోబోలు సాంప్రదాయకంగా మానవులకు కేటాయించబడిన పాత్రల్లోకి అడుగుపెడుతున్నాయి. రోబోలకు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో రోబోలు సన్యాసులతో కలిసి కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇప్పుడీ వీడియో అందరినీ అబ్బురపరుస్తోంది. చైనా నుండి వచ్చిన తాజా వీడియోలో చరిత్రాత్మక షావోలిన్ ఆలయంలో సన్యాసులతో కలిసి కుంగ్ ఫూ సాధన చేస్తున్న హ్యూమనాయిడ్ రోబోలు కనిపిస్తున్నాయి.
China Population: జనాభా గణాంకాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. చాలా దేశాలు సంతానలేమి సమస్యతో సతమతమవుతున్నాయి. ప్రపంచంలోనే జనాభా సంఖ్యలో అగ్రగామిగా ఉన్న చైనా… ఇపుడు నానాటికీ తగ్గిపోతోంది. జనాభా పెరుగుదలలో చైనాను అధిగమించిన భారత్ ప్రపంచంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జనాభా పెరుగుదలలో చైనా ఎందుకు వెనుకబడింది. భారత్ పెరుగుదల దేనికి సంకేతమని భావిస్తున్నారు? జనాభా గణాంకాలు ఏం చెబుతున్నాయి?
Ice Tsunami Video: చలికాలం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా మంచు కురుస్తోంది. ఈ మంచు కారణంగా కొన్ని చోట్ల అవలాంఛ్లు ఏర్పడుతుండగా.. మరికొన్ని చోట్ల మంచు సునామీలు సంభవిస్తున్నాయి. తాజాగా చైనాలో మంచు సునామీ వచ్చింది. జిన్జియాంగ్ ప్రాంతంలో గడ్డ కట్టిన ఓ నదిలో ‘మంచు సునామీ’ అలలు ఏర్పడ్డాయి. పూర్తిగా మంచు పేరుకుపోయిన నదిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pakistan Army Chief Asim Munir made provocative comments on Operation Sindoor: చింత చచ్చినా.. పులుపు చావదట.. ఈ సామేత వినే ఉంటారు. కొంతమంది బుద్ధి కూడా అంతే. ఎంతసేపు పక్కొళ్లను రెచ్చగొట్టి పైశాచిక ఆనందం పొందడం వారి వ్యక్తిత్వం. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు మోపుతుంటారు. కారణం వారి బలహీనత ఎక్కడ భయటపడుతుందోనన్న భయం. అచ్చం పాకిస్తాన్ రక్షణ దళాలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి ఆపరేషన్ సింధూర్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ లో తమకు అల్లా సహాయం చేసినట్లు చెప్పుకొచ్చాడు.
India VS China Currency: భారత్ కు పొరుగు దేశమైన చైనా కరెన్సీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీగా కొనసాగుతోంది. అయితే భారత్ నుంచి ఎంతో మంది ఇతర దేశాలకు వలస వెళ్తుంటారు.అక్కడ సంపాదించిన డబ్బు భారత్ లో డబుల్ అవుతుంది. అయితే చైనాలో ఒకలక్ష రూపాయలు సంపాదిస్తే..మన భారత్ దేశంలో 10 తులాల బంగారం కొనుగోలు చేయవచ్చు. చైనా కరెన్సీ భారత్ లో ఎంత పవర్ ఫుల్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Mines: బంగారానికి శతాబ్దాల నుంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. బంగారం మానవ సమాజానికి ఆర్థిక బలం, సామాజిక గౌరవం, భద్రతకు సూచికగా నిలుస్తోంది. బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు..అదొక శక్తి. గౌరవానికి ప్రతిష్టకు, సంపదకు ప్రతిరూపంగా నిలుస్తోంది. భారత్ వంటి ఆసియా దేశాల్లో బంగారం అనేది పండగలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి వేడుకల్లో తప్పనిసరిగా ధరించే సంప్రదాయం ఉంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు భారత్ లోనే కాదు తక్కువ జనాభా ఉండే ఇతర దేశాల్లోనూ ఉన్నాయని కొత్త నివేదికలు చెబుతున్నాయి.
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన సుంకాల బెదిరింపులతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇటీవల రష్యాతో చమురు వ్యాపారం కొనసాగిస్తే భారత్‌పై భారీ టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించిన ట్రంప్, ఇప్పుడు చైనాపై కన్నేశారు. నవంబర్ 1వ తేదీ లోపు అమెరికాతో న్యాయమైన వాణిజ్య ఒప్పందం కుదరనట్లయితే చైనాపై సుంకాలను 155 శాతం వరకు పెంచుతానని ఆయన కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
Gold Rate Donald Trump Tariffs: అక్టోబర్ 11 నాటికి బంగారం ధర గ్రాముకు రూ.1.25 లక్షలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ, రాజకీయ అంశాల కారణంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈలోగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్ల ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
America Vs China: చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మండిపడ్డారు. అరుదైన ఖనిజాల ఎగుమతులు చూపించి, ప్రపంచాన్ని బందీలుగా చేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Afghanistan On Trump Demand : ఏం పీక్కుంటారో పీక్కోండి..ఇంచు భూమి కూడా ఇవ్వబోమంటూ అమెరికాకు తాలిబాన్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. అప్గాన్ లోని బాగ్రాం వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు తాలిబాన్ కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వివాదం అంతర్జాతీయ చర్చకు దారి తీస్తోంది.
Shanghai co operaration organisation summit Tianjin: ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటన చేపట్టారు. షాంఘై సహకార సంస్థ SCO సమావేశంలో భేటీ అయ్యారు. ఈ టూర్ లో ఇరుదేశాల సంబంధాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Modi China Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడు సంవత్సరాల తర్వాత చైనాకు వెళ్లారు. అక్కడ ఆయన తియాజింగ్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఆదివారం సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్, చైనా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. అమెరికా భారీ సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ ఇరు దేశాధినేతల సమావేశం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడు సంవత్సరాల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో పాల్గొనేందుకు ఆయన టియాన్జిన్ నగరానికి చేరుకున్నారు. ఈ సమావేశం రెండు రోజుల పాటు జరుగుతుంది. ఈ సందర్భంగా మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Gold Usage: దేశీయంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. డాలర్ విలువ తగ్గుతుండటంతో బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే భారత్ పొరుగు దేశమైన చైనాలో బంగారానికి డిమాండ్ తగ్గిందని..కానీ విలువ పరంగా చూస్తే ఆభరణాల వినియోగం పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పరిశోధనా అధిపతి రే జియా తెలిపారు. చైనాతో పోలిస్తే భారత్ బంగారం డిమాండ్ రెట్టింపు అయ్యిందని..దేశంలో బంగారం వినియోగం దాదాపు 800 టన్నులు దాటినట్లు పేర్కొన్నారు.
Gold Rate: బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. తులం బంగారం ధర మళ్లీ లక్ష రూపాయలు దాటేసింది. దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి తీవ్ర నిరాశ తప్పడం లేదు. అయితే భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా అనే గందరగోళం చాలా మందిలో నెలకొంది. అలాంటి వారికి చైనా రూపంలో మరో శుభవార్త రాబోతోంది. చైనా ఒకవేళ ఈ నిర్ణయం కానీ తీసుకుంటే బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ నిర్ణయం ఏంటో చూద్దాం.