Viral Video: కారు ఢీకొట్టడంతో కిందపడిన బైకర్.. లేచిన బైకిస్ట్‌ రియాక్షన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు! ట్విస్ట్ ఏంటంటే

Biker Falls on Ground After Being Hit by Car. ఓ వ్యక్తి తన బైక్‌పై వెళుతుండగా.. ఓ కారు ఢీకొడుతుంది. . బైకర్ తనవైపు వస్తుండడంతో కారు డ్రైవర్ భయపడిపోతారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 04:48 PM IST
  • కారు ఢీకొట్టడంతో కిందపడిన బైకర్
  • బైకిస్ట్‌ రియాక్షన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు
  • నేను చూసిన అత్యంత దయ ఉన్న వ్యక్తి
Viral Video: కారు ఢీకొట్టడంతో కిందపడిన బైకర్.. లేచిన బైకిస్ట్‌ రియాక్షన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు! ట్విస్ట్ ఏంటంటే

Google Trend Video: Biker hugs Car Driver After Car hits him: ప్రస్తుతం యువత చాలా దూకుడుగా ఉంటోంది. గొడవల జోలికి పోనివారు చాలా తక్కువ. ప్రయాణం సమయంలో రోడ్డుపై వెళుతుంటే వాహనాలు చిన్నగా ఢీ కొట్టినా.. పెద్ద సీన్ చేస్తుంటారు. ఒక్కోసారి అరుచుకోవడం, కొట్టుకోవడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఓ బైకర్ ఇందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించాడు. కారు ఢీకొట్టడంతో కిందపడిన బైకర్.. లేచి కారు డ్రైవర్‌ను హాగ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఫారిన్‌లో జరిగింది. 

ఓ వ్యక్తి తన బైక్‌పై వెళుతుండగా.. సిగ్నల్ వద్ద ఓ కారు అనుకోకుండా ఢీకొడుతుంది. వెంటనే అతడు నడిరోడ్డుపై పడిపోతాడు. కొన్ని సెకన్ల తర్వాత ఆ బైకర్ లేచి తనని ఢీకొన్న కారు వైపు వేగంగా అడుగులు వేస్తూ నడుస్తుంటాడు. బైకర్ తనవైపు వస్తుండడంతో కారు డ్రైవర్ భయపడిపోతారు. అయితే తనను ఢీకొట్టిన కారు డ్రైవర్ యువతి కావడంతో బైకిస్ట్‌ హగ్ ఇచ్చి కాసేపు మాట్లాడాడు. ఇది చూసిన పక్కన వారు ఒక్కసారిగా ఆచ్చర్యపోయారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన కాప్స్ కూడా బైకిస్ట్‌ రియాక్షన్ చూసి నోరెళ్లబెట్టటారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Good News Movement (@goodnews_movement)

ఇందుకు సంబందించిన వీడియోను 'గుడ్ న్యూస్ మూమెంట్' అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూసర్ పోస్ట్ చేశారు. 'ఈ వ్యక్తి తన మోటార్‌ సైకిల్‌పై వెళుతుండగా.. కారు ఢీకొట్టింది' అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తూ బైకర్‌ను ప్రశంసిస్తున్నారు. 'చాలా మంచి మనసు', 'అతని లాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం', 'నేను చూసిన అత్యంత దయ ఉన్న వ్యక్తి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Sachin - Gill: సేమ్ టూ సేమ్.. 2009లో సచిన్‌, 2022లో గిల్‌! ఐపీఎల్‌లో ఈ ఇద్దరు మాత్రమే..

Also Read: Mahesh Babu: మహేష్ బాబు బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా.. ఇంట్రెస్టింగ్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News