Mahesh Babu: మహేష్ బాబు బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా.. ఇంట్రెస్టింగ్..!

Sarkaru Vaari Paata Hero Mahesh Babu on Sitara. భవిష్యత్తులో 'సితార వెండితెరపై నటిగా చేసే అవకాశం ఉందా? అని ఫాన్స్ అడిగినప్పుడు.. 'సితార ఇప్పటికే నటి అని నేను అనుకుంటున్నాను' అని మ‌హేష్ బాబు అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 03:49 PM IST
  • మే 12న సర్కారు వారి పాట విడుదల
  • మహేష్ బాబు బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా
  • సితార ఇప్పటికే నటి
Mahesh Babu: మహేష్ బాబు బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా.. ఇంట్రెస్టింగ్..!

Sarkaru Vaari Paata Hero Mahesh Babu says Namrata Shirodkar is my Best Friend: 'సూపర్‌ స్టార్‌' మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఎస్‌వీపీ సినిమా గురువారం (మే 12) విడుదల కానుంది. మ‌హేష్‌ బాబు నుంచి సినిమా వ‌చ్చి దాదాపు రెండున్న‌రేళ్లు  దాటిన నేపథ్యంలో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీ స్థాయిలో అంచ‌నాలున్నాయి. ఇక చిత్ర యూనిట్ నాన్ స్టాప్‌గా ప్ర‌మోష‌న్ల‌ను చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

ఎస్‌వీపీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మ‌హేష్ బాబు బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు సూపర్‌ స్టార్‌ జవాబులు ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించారు. మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు? అని ఓ అభిమాని అడగ్గా.. తన భార్య నమ్రత శిరోద్కర్ పేరు చెప్పారు. నమ్రతలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి అని ఇంకొకరు అడిగిన ప్రశ్నకు.. ఆమెలో అన్నీ ఇష్టమే, అందుకే పెళ్లి చేసుకున్నా అని మహేష్ నవ్వుతూ బదులిచ్చారు.

స‌ర్కారు వారి పాట‌ సినిమాలోని పెన్నీ సాంగ్‌లో మ‌హేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని స్టెప్పులేసిన విషయం తెలిసిందే. పాటలో 10 ఏళ్లు నిండిన సితార కనిపించడంతో.. భవిష్యత్తులో వెండితెరపై నటిగా చేసే అవకాశం ఉందా? అని ఫాన్స్ అడిగినప్పుడు మ‌హేష్ బాబు జోకులు పేల్చారు. 'సితార ఇప్పటికే నటి అని నేను అనుకుంటున్నాను' అని అన్నారు. మీ కుటుంబంలో స్మార్ట్‌ పర్సన్‌ ఎవరు? అని అడిగితే.. వెంటనే సీతు పాప అన్నారు. బిజీ షెడ్యూల్స్‌లోనూ పిల్లలకు సమయాన్ని ఎలా కేటాయిస్తున్నారు? అని ప్రశ్నించగా.. అది చెప్పలేను కానీ పిల్లలతో మాత్రం తప్పకుండా సమయాన్ని గడపడానికి ఇష్టపడతా అన్నారు. 

స‌ర్కారు వారి పాట‌ చిత్రంలో సముద్రఖని, నదియా, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్.. ఎస్‌వీపీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. 'గీతా గోవిందం' తర్వాత పరశురామ్ తెరకెక్కించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

Also Read: Sachin - Gill: సేమ్ టూ సేమ్.. 2009లో సచిన్‌, 2022లో గిల్‌! ఐపీఎల్‌లో ఈ ఇద్దరు మాత్రమే..

Also Read: SVP First Review: 'సర్కారు వారి పాట' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సింహంలా గర్జించిన మహేష్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News