Black tigers video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నల్ల పులుల వీడియో.. మీరు ఓ లుక్కేయండి..!

Black tigers: అరుదుగా కనిపించే వాటిలో నల్ల పులులు ఒకటి. ఇవి మనదేశంలో కేవలం ఒడిశాలో మాత్రమే కనిపిస్తాయి. తాజాగా ఈ పులులకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2024, 03:47 PM IST
Black tigers video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నల్ల పులుల వీడియో.. మీరు ఓ లుక్కేయండి..!

Black tigers Viral Video: పులుల్లో చాలా రకాలు ఉన్నాయి. బెంగాల్ టైగర్, సైబీరియన్ టైగర్, సుమిత్రన్ టైగర్ ఇలా రకాల పులులను మనం చూసుంటాం. కానీ నల్ల పులులు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ బ్లాక్ టైగర్ కనిపించే ఏకైక ప్రదేశం మన ఇండియాలోని ఒడిశాలో గల సిమిలిపాల్ టైగర్ రిజర్వ్. వీటిపై ఉన్న నల్ల చారలు జన్యు పరివర్తన కారణంగా ఏర్పడుతాయి. వీటిని 'సూడో మెలానిస్టిక్ (pseudo-melanistic tigers)' పులులు అంటారు. తాజాగా నల్లపులులకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో షేర్ చేశారు. మనదేశంలో ఇంతకముందు నల్లపులులు ఒకటో రెండో ఉన్నాయని విన్నాం, కానీ తాజా వీడియో చూస్తే నాలుగు పులులు కెమెరా కంటికి చిక్కాయి. తాజాగా ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్  అవుతుంది. 

మనదేశంలో నల్లపులి తొలిసారి 1993లో కనిపించింది. ఇది  పొడగడ్ గ్రామానికి చెందిన సల్కు అనే యువకుడు పై దాడి చేయగా.. తనను తాను రక్షించుకోవడానికి అతడు బాణాలతో పులిని చంపేశాడు. ఈ ఘటన కారణంగానే తొలిసారి నల్లపులి భారత రికార్డులలోకెక్కింది. ఇవి తక్కువ సంఖ్యలో.. చాలా అరుదుగా ఉంటాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా నల్లపులులకు సంబంధించిన వీడియోను జనవరి 07న పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోకు ''ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరచదు. ఇది చాలా అరుదైన వాటిలో ఒకటి... ఒడిశా అడవుల నుండి వచ్చిన పూర్తి సూడో మెలనిస్టిక్ టైగర్ ఫ్యామిలీ'' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియో అప్ లోడ్ చేసినప్పటి నుంచి లక్షల్లో లైక్స్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. 

Also Read: King Cobra Video: కింగ్‌ కోబ్రా రక్తాన్ని ఛాయ్‌లా తాగిన యువకుడు..ఉన్నడా పోయాడా?

Also Read:Viral Video: 15 అడుగుల కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వీడియో చూస్తే మైండ్ పోద్ది...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News