Trigraha Yogam: ఐదేళ్లకు ఏర్పడనున్న మహా శుభయోగం, మూడు రాశులపై ఊహించని కనకవర్షం

Trigraha Yogam: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా ఉంటుంది. ధనస్సు రాశిలో ఏర్పడనున్న మహాశుభ యోగం ఆ మూడు రాశులకు మహర్దశ కల్గించనుంది. ఊహించని కనకవర్షం కురిపించనుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2024, 06:11 AM IST
Trigraha Yogam: ఐదేళ్లకు ఏర్పడనున్న మహా శుభయోగం, మూడు రాశులపై ఊహించని కనకవర్షం

Trigraha Yogam: గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటాయి. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం ప్రతికూలంగా లేదా సానుకూలంగా పడుతుంటుంది. ధనస్సు రాశిలో సూర్యుడు, మంగళ, బుధ గ్రహాలు కలవనున్నాయి. దాంతో త్రిగ్రహ యోగం ఏర్పడి మూడు రాశులకు అద్భుతమైన లాభాల్ని అందించనుంది. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం విశేష ప్రాధాన్యత, మహహత్యం కలిగి ఉంటాయి. కొత్త ఏడాదిలో జనవరి నెలలో చాలా గ్రహాల గోచారముంది. ఈ గ్రహాల గోచారంతో శుభ, అశుభ యోగాలు ఏర్పడనున్నాయి. జనవరిలో ధనస్సు రాశిలో ఏర్పడనున్న త్రిగ్రహ యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఐదేళ్ల తరువాత ఏర్పడనుంది. ఫలితంగా మూడు రాశులకు ఊహించని విధంగా లాభం కలగనుంది. ఒకే రాశిలో మూడు వేర్వేరు గ్రహాలు ఒకేసారి కలిసి ఉంటే త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. ఈ మూడు గ్రహాల మధ్య జ్యోతిష్యం ప్రకారం స్నేహబంధం ఉంటే ఒకదాన్నించి మరో గ్రహాన్నికి శక్తి ప్రసరింపబడుతుంది. దీనివల్ల నెగెటివిటీ మరింతగా పెరుగుతుంది. 

మేష రాశి జాతకులకు త్రిగ్రహ యోగం ఊహించని లాభాలు కల్గించనుంది. దనస్సు రాశిలో త్రిగ్రహ యోగం వల్ల అదృష్టం తోడుగా నిలుస్తుంది. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు ఊహించని లాభం చేకూరనుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతి ఉంటుంది. వ్యాపారులు విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. పెండింగులో పడిన పనులు పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి పని దిగ్విజయమౌతుంది. వ్యాపారులు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అవకాశాలున్నాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. 

తులా రాశి జాతకులపై త్రిగ్రహ యోగం శుభప్రదం కానుంది. పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్ధులకు ప్రయోజనం కలుగుతుంది. కుటుంబసభ్యుల మధ్య విబేధాలు తొలగిపోతాయి. త్రిగ్రహ యోగం కారణంగా కోరుకున్న పనులు, కోర్కెలు నెరవేరుతాయి. విదేశాలతో వ్యాపారం చేస్తుంటే ఊహించని లాభాలు కలగనున్నాయి. ఆర్దిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జాతకం వారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. 

ధనస్సు రాశి జాతకులపై త్రిగ్రహ యోగం ప్రబావంతో గోల్డెన్ డేస్ ప్రారంభమౌతాయని చెప్పవచ్చు. ఈ రాశివారికి జాతకం అంత బాగుంటుంది. చేపట్టిన పనులు వెనువెంటనే పూర్తయిపోతాయి. ఎలాంటి విఘాతం కలగదు. ఈ రాశివారికి అన్ని రకాల సుఖాలు కలుగుతాయి. కుటుంబ సంబందాలు పటిష్టమౌతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు చాలా అనువైన సమయం. మంచి ఉద్యోగాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి. వ్యాపారులకైతే ఊహించని లాభాలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు, ఆదాయం పెరగడం వల్ల ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. 

Also read: Guru Transit: కొన్ని సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి గృహస్పతి..ఈ 3 రాశుల వారికి జరగబోయేది ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News