Leopards fight video: చెట్టుపై భయంకరంగా కొట్టుకున్న చీతాలు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..

Viral Video today: వ‌న్య‌ప్రాణి ప్రేమికుల‌కు గూస్‌బంప్స్ తెప్పించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రెండు చిరుతలు చెట్టు మీద కొట్టుకోవడం చూడవచ్చు. మీరు ఓ లుక్కేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2024, 02:32 PM IST
Leopards fight video: చెట్టుపై భయంకరంగా కొట్టుకున్న చీతాలు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..

Leopards fight video viral: భూమ్మిద క్రూర జంతువులలో చిరుత కూడా ఒకటి. ఇది వేటాడిన వేటను చెట్టుపైకి తీసుకెళ్లి తింటుంది. ఈ మధ్య చిరుతలు జనావాసాల్లోకి వచ్చి పశువులపైనే, మనుషులపైన దాడి చేయడం చూస్తున్నాం. చీతా ఎప్పుడు ఒంటరిగానే వేటాడుతుంది. ఇవి వేరొక చిరుతను తన యారియాలోకి రానివ్వదు. ఒక వేళ వచ్చిందంటే వాటి మధ్య భయంకరమైన యుద్ధమే జరుగుతోంది. ఈ చిరుతలు ప్రాణాలు పోయే వరకు కొట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ థ్రిల్లింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ చిరుత చెట్టు మీద ఉంటుంది. ఇంతలో సడన్ గా మరో చిరుత.. చెట్టు మీదనున్న చీతాపైకి దూసుకెళ్తోంది. ఈ రెండు కూడా చెట్టుపై కలబడుతూ.. ఒక్కసారిగా కింద పడిపోతాయి. అంత ఎత్తు నుంచి పడినా సరే అవి ఫైటింగ్ ను ఆపవు. ఒకదానిపై ఒకటి పంజాలు విసురుకుంటూ పోరు సాగిస్తాయి. ఈ వీడియోను big_cats_nature అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయగా.. ఇది నెట్టింట ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. రెండ్రోజుల క్రితం షేర్ అయిన ఈ వీడియోకు వేలల్లో లైక్స్, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆ గర్జనలు నన్ను వెంటాడుతున్నాయని ఓ వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Big Cats & Nature Photography | Safari | Travel (@big_cats_nature_photography)

 

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా చీతాల థ్రిల్లింగ్ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. మీరు కూడా చూసేయండి.

Also Read: Viral Video today: ప్రేమ పేరుతో అమ్మాయిలే కాదు.. ఆడ సింహాలు కూడా మోసం చేస్తాయి.. ఈ వీడియో చూడండి..

Also Read: Viral News: ఇదేంది సారూ... పీకల దాక తాగి స్కూల్ కు వచ్చిన ఉపాధ్యాయుడు.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News