Teacher Enters Jabalpur School In Inebriated State: కొందరు ఉపాధ్యాయులు పవిత్రమైన వృత్తికి మచ్చ తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తమ పిల్లలకు చక్కని చదువు, సంస్కారం నేర్పిస్తారని తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తుంటాయి. పిల్లలు ఇంట్లో కన్నా.. పాఠశాలలో ఎక్కువ సేపు ఉంటారు. సమాజంలో మంచి గౌరవంగా ఎలా మెలగాలి. ఎలా కష్టపడితే మంచి జాబ్ వస్తుంది. ఇలా చిన్నప్పటి నుంచి వారి మెదడులు మంచిని నిపింతే అదే విధంగా పిల్లలు మారుతారు.
Read More: Ram Pothineni: రెమ్యునరేషన్ తగ్గించుకొని యువహీరో.. ఏకంగా అన్ని కోట్లు అడిగారా?
అయితే.. కొందరు ఉపాధ్యాయులు పిల్లలను మంచిగా తీర్చిదిద్దుతారు. కానీ మరికొందరు దీనికి భిన్నంగా ఉంటారు. పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయి. తాజాగా, ఒక ఉపాధ్యాయుడు తప్పతాగి స్కూల్ కు వచ్చాడు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా... జమునియా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజేంద్ర నేతమ్ విపరీతంగా మద్యం సేవించాడు. అంతటితో ఆగకుండా.. పూర్తిగా మత్తులో పాఠశాల ఆవరణలోకి వచ్చాడు. మైకంలో ఎటు కదల్లేక స్పృహ తప్పి పడిపోయాడు. కొందరు విద్యార్థులు తమ ఉపాధ్యాయుడి నిర్వాకాన్ని వీడియోలు తీశారు.
#जबलपुर के शासकीय प्राथमिक विद्यालय के शिक्षक राजेंद्र नेताम का छात्रों ने बनाया शराब के नशे में धुत वीडियो@DM_Jabalpur @jabalpurdm #Jabalpur pic.twitter.com/eo8YfKOW8N
— MP Breaking News (@mpbreakingnews) February 3, 2024
ఆతర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఆరాతీసింది. ఇప్పటికే.. ఉపాధ్యాయుడి తీరుపై గతంలో పలుమార్లు విద్యార్థులు, ఉపాధ్యాయులు ధ్వజమెత్తినా చర్యలు తీసుకోలేదన్నారు. నేతమ్, అతను తరచూ తన ఉద్యోగానికి తాగి వస్తాడని, అతని కారణంగా కొంతమంది విద్యార్థులు పాఠశాల నుండి నిష్క్రమించారని వారు ఆరోపించారు.
Read More: Joint Pain: ఆయుర్వేదం ప్రకారం కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
స్థానికుల ప్రకారం.. ఉపాధ్యాయుడు జమునియా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరిప్పటినుంచి రోజు తప్పతాగే వాడని చెబుతున్నారు. అదే విధంగా స్కూల్ కు మద్యం తాగి వస్తుండే వాడని కూడా ఆరోపిస్తున్నారు. నేతమ్ అనేక మార్లు మద్యం సేవించి రోడ్డుపై జారిపడ్డాడని స్థానికులు తెలిపారు. ఇతనిపై జిల్లా విద్యాశాఖకు గతంలో అనేక ఫిర్యాదులు వచ్చినా నేతంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా, అతని చేష్టల వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడంతో, జిల్లా అధికారులు, విద్యాశాఖ సీరియస్ అయ్యింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook