Railways Stations Names: అతి పెద్ద పేరున్న రైల్వే స్టేషన్ ఇదే.. అలాగే అతి చిన్న పేరున్న స్టేషన్ కూడా ఇదిగో

Railways Stations Names: రైల్వే స్టేషన్ల పేర్ల విషయంలో ఇవాళ మేము మీ ముందుకు ఒక ఆసక్తికరమైన అంశాన్ని తీసుకొచ్చాం. మీరు రైలు ప్రయాణంలో చేసేటప్పుడు మార్గం మధ్యలో మనం ఎక్కడి వరకు వచ్చాం అని చెక్ చేసుకునేందుకు ఏం చేస్తాం.. రైలు కిటికీలోంచి బయటికి చూసి ఏదైనా స్టేషన్ క్రాస్ చేస్తుందేమో గమనిస్తాం.

Written by - Pavan | Last Updated : Jul 15, 2023, 09:01 AM IST
Railways Stations Names: అతి పెద్ద పేరున్న రైల్వే స్టేషన్ ఇదే.. అలాగే అతి చిన్న పేరున్న స్టేషన్ కూడా ఇదిగో

Railways Stations Names: రైల్వే స్టేషన్ల పేర్ల విషయంలో ఇవాళ మేము మీ ముందుకు ఒక ఆసక్తికరమైన అంశాన్ని తీసుకొచ్చాం. మీరు రైలు ప్రయాణంలో చేసేటప్పుడు మార్గం మధ్యలో మనం ఎక్కడి వరకు వచ్చాం అని చెక్ చేసుకునేందుకు ఏం చేస్తాం.. రైలు కిటికీలోంచి బయటికి చూసి ఏదైనా స్టేషన్ క్రాస్ చేస్తుందేమో గమనిస్తాం. ఆ స్టేషన్ క్రాస్ చేసే సమయంలోనే అక్కడి నేమ్ బోర్డుపై ఉన్న స్టేషన్ పేరు చదివి మనం ఎక్కడున్నామో తెలుసుకుంటాం. కానీ కొన్నిసార్లు స్టేషన్ పేరు పెద్దగా ఉండి మనం ప్రయాణిస్తున్న రైలు వేగంగా వెళ్తుందనుకోండి.. అప్పుడు మనకు ఆ స్టేషన్ పేరు చదివేంత సమయం దొరకదు కదా.. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే ఈ స్టేషన్ పేరు కూడా అలాంటిదే. 

జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు రైల్లో ప్రయాణిస్తున్నట్టుగా మనసులో ఊహించుకుని ఇక్కడ బోర్డుపై కనిపిస్తున్న రైల్వే స్టేషన్ పేరు చదవండి. మీరు అక్షరం, అక్షరం కలిపి చదివేలోపే రైలు వెళ్లిపోతున్న ఫీల్ కలుగుతుంది. కావాలంటే జస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రైల్వే స్టేషన్ పేరు నిజంగానే అంత పెద్దది మాత్రమే కాదు.. కొత్త వారికి కొంత కన్ ఫ్యూజింగ్ గానూ ఉంటుంది. ప్రత్యేకించి తెలుగు వారికి కాకుండా ఉత్తరాది వారికి కానీ లేదా వేరే రాష్ట్రాల వారికి కానీ స్టేషన్ పేరు చదవలేరు సరికదా.. కనీసం ఊహకైనా అందదు. ఎందుకంటే వెంకటనర్సింహరాజువారిపేట అనే ఈ ఊరి పేరులో మొత్తం 28 ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి.

మన దేశంలో మొత్తం 7349 రైల్వే స్టేషన్లు ఉండగా.. ఈ రైల్వే స్టేషన్ల ద్వారా రోజూ కొన్ని లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే పొడవైన పేరున్న రైల్వే స్టేషన్ల జాబితాలో ఈ వెంకటనరసింహరాజువారిపేట రైల్వే స్టేషన్ నెంబర్ 1 స్థానంలో ఉందట. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ రైల్వే స్టేషన్.. రేణుగుంట నుంచి తమిళనాడులోని అరక్కోణం వెళ్లే రైలు మార్గం మధ్యలో ఆంధ్రా - తమిళనాడు సరిహద్దుల్లో ఎదురవుతుంది.  

అతి చిన్న రైల్వే స్టేషన్ పేరు
ఇప్పటివరకు మనం అతి పొడవైన పేరున్న రైల్వే స్టేషన్ గురించి తెలుసుకున్నాం కదా.. ఇక ఇప్పుడు అదేవిధంగా, మన దేశంలో అత్యంత చిన్న పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఇది కేవలం రెండంటే రెండు అక్షరాల పేరుతో వచ్చే రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ పేరు ఈబ్. ఇంగ్లీష్‌లోనూ జస్ట్ రెండంటే రెండు అక్షరాల్లో IB అని రాస్తారు. ఈబ్ నది నుంచి దీనికి ఈ పేరు వచ్చిందని అక్కడి స్థల పురాణం చెబుతోంది. ఒడిశాలోని బిలాస్‌పూర్ డివిజన్‌లో ఈ రైల్వే స్టేషన్ ఉంది. 

ఇది కూడా చదవండి : Side Effects of Maggi: మ్యాగీ తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌లో ప్రాణాంతకమైన జబ్బు ?

పేరులోనే కాదు.. 
ఈ రైల్వే స్టేషన్ పేరులోనే కాదు.. నిజంగానే చిన్న రైల్వే స్టేషన్ కూడా. పేరుకు తగినట్టుగానే రెండే ప్లాట్‌ఫామ్స్ ఉన్న ఈ రైల్వే స్టేషన్‌లో అతి కొద్ది రైళ్లు మాత్రమే ఆగుతాయి. అది కూడా రెండంటే రెండు నిమిషాలు మాత్రమే ఇక్కడ రైళ్లకు హాల్ట్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్‌కి రెండు అనే అంకెకు ఏదో అవినాభవ సంబంధం ఉన్నట్టుగా ఉంది కదూ..

ఇది కూడా చదవండి : Rs 20 per day to Rs 100 Cr Business: ఒకప్పుడు రూ. 20 కూలీ.. ఇప్పుడు రూ. 100 కోట్ల వ్యాపారానికి యజమాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News