Rs 20 per day to Rs 100 Cr Business: ఒకప్పుడు రూ. 20 కూలీ.. ఇప్పుడు రూ. 100 కోట్ల వ్యాపారానికి యజమాని

Rs 20 per day to Rs 100 Cr Business, Chinu kala Success Story: కష్టపడనిదే విజయం ఎప్పుడూ అంత ఈజీగా రాదు అంటుంటారు మన పెద్దలు. అందుకే మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటే అందుకోసం అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అలా కష్టపడితే మీరు మీ లక్ష్యాన్ని సాధించకుండా ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోలేదు. దేశంలోని మోస్ట్ ఇన్‌స్పైరింగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యువర్స్‌లో ఒకరైన చిను సక్సెస్ స్టోరీ విషయంలో కూడా అదే జరిగింది.

Written by - Pavan | Last Updated : Jul 15, 2023, 08:47 AM IST
Rs 20 per day to Rs 100 Cr Business: ఒకప్పుడు రూ. 20 కూలీ.. ఇప్పుడు రూ. 100 కోట్ల వ్యాపారానికి యజమాని

Rs 20 per day to Rs 100 Cr Business, Chinu kala Success Story: కష్టపడనిదే విజయం ఎప్పుడూ అంత ఈజీగా రాదు అంటుంటారు మన పెద్దలు. అందుకే మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటే అందుకోసం అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అలా కష్టపడితే మీరు మీ లక్ష్యాన్ని సాధించకుండా ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోలేదు. దేశంలోని మోస్ట్ ఇన్‌స్పైరింగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యువర్స్‌లో ఒకరైన చిను సక్సెస్ స్టోరీ విషయంలో కూడా అదే జరిగింది. చాలామంది జీవితంలో తమ బాల్యాన్ని బాగా ఎంజాయ్ చేసి ఉండుంటారు. కానీ చిను విషయంలో మాత్రం అలా జరగలేదు. చినుకు బాల్యం నుంచే కష్టాలు అంటే ఏంటో తెలుసు. ఆ కష్టాల్లోంచే ఆమె తన జీవితాన్ని ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కట్టుకున్నట్టుగా కష్టాల కడలిలోంచే అందమైన జీవితాన్ని నిర్మించుకోవడం మొదలుపెట్టింది. అలా ఒకప్పుడు రోజుకు రూ. 20 కూలీగా పనిచేసిన చిను ఇప్పుడు రూ. 100 కోట్ల జువెలరీ బ్రాండ్‌కు యజమాని కావడమే కాకుండా ఎంతో హుందాగా BMW లాంటి లగ్జరీ కారుని కూడా మెయింటెన్ చేస్తోంది. ఒకప్పుడు కూలీగా మరొకరి కోసం పనిచేసిన చిను ఇప్పుడు రూబాన్స్ అనే ఫేమస్ ఫ్యాషన్ జ్యువెలరీ యాక్సెసరీస్‌ కంపెనీకి డైరెక్టర్ గా సమాజంలో తగిన గౌరవ, మర్యాదలు పొందుతున్నారు.

చిను కళ జీవిత ప్రస్థానం
చిరు పూర్తి పేరు చిను కళ. 15 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే చిను తన ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆమె వద్ద ఉన్న బ్యాగ్‌లో కేవలం రూ. 300 నగదు, ఇంకొన్ని బట్టలు మాత్రమే ఉన్నాయి. ఆపన్న హస్తం అందించే వారు లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక 2 రోజుల పాటు రైల్వే స్టేషన్‌నే మకాం చేసుకుంది. ఆశ్రయం ఇచ్చే వారు లేక అక్కడే రెండు రాత్రులు నిద్రించాల్సి వచ్చింది. జీవితంలో అందరిలాగే తనకు కూడా అన్నీ కావాలనుకుంది. జీవితంలో శ్రీమంతుల కంటే తానేం తక్కువ కాదనేలా బతకాలనుకుంది. రోజుకు 20 రూపాయల చిన్న జీతానికి సేల్స్ గర్ల్‌గా ఒక చోట పనిలో చేరింది. అక్కడ ఆమె చేయాల్సింది ఏంటంటే.. కత్తులు, సాసర్లు, టీ కప్పులపై మూతలు వంటివి అమ్మడం చేసేది. 

స్కూల్ డ్రాపౌట్ టు బిజినెస్ ఓనర్..
15 ఏళ్ల వయస్సులోనే తన కాళ్ల మీద తను నిలబడటం కోసం ఇంట్లోంచి బయటికి రావాల్సి వచ్చిన చిను కళ 10వ తరగతి వరకే చదువుకుంది. అలా చదువు మధ్యలోనే ఆపేసిన చిను కళకు ఇంట్లోంచి వెళ్లొచ్చిన రోజును తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అని చెబుతోంది. కేవలం 300 రూపాయలతో ఎన్ని రోజులు, ఎక్కడ ఉంటానో తెలియదు. ఏం తినగలనో తెలియదు. అలాంటి దశలో ఇంట్లోంచి బయటికొచ్చి ఒక చోట పనికి కుదిరిని చిను.. అప్పట్లో ఒక చిన్న గదిలో నివాసం ఉండేది. అందులో ఎటాచ్డ్ బాత్రూం, కిచెన్ లాంటి సౌకర్యాలు ఏవీ లేవు. అలాంటి ఇంట్లో మొదలైన ఆమె జీవిత ప్రస్థానం, పట్టుదల, జీవితంలో ఎదగాలన్న సంకల్పం ఆమెను ఇప్పుడు బెంగుళూరులో ఖరీదైన ప్రాంతంలో 5000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఖరీదైన బంగ్లాలో ఉండే దశకు చేరేలా చేసింది.

కాన్ఫిడెన్స్ ఇచ్చిన మిసెస్ ఇండియా కాంటెస్ట్
జీవితంలో పోరాడుతూనే ఉంది ఒకసారి మిసెస్ ఇండియా కాంటెస్టులో పాల్గొన్న చిను.. ఆ పోటీల్లో గెలవకపోయినా.. జీవితంలో గెలిచే పాఠాలను నేర్చుకుంది. టాప్ 10 ఫైనలిస్టులో ఒకరిగా నిలిచింది. ఆ తరువాత రూ. 3 లక్షల పెట్టుబడితో రుబాన్స్ అనే జువెలరీ యాక్సెసరీస్ బిజినెస్ ప్రారంభించింది. మొదట్లో ఒక్క దుకాణంతోనే వ్యాపారం ప్రారంభించిన చిను... ఆ తరువాత మూడు దుకాణాలు, ముగ్గురు సేల్స్ గాళ్స్‌ని నియమించుకునే స్థాయికి ఎదిగింది. 

ఇది కూడా చదవండి : Hotel Waiter To IAS Officer: హోటల్లో వెయిటర్‌గా పనిచేసుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు

బిజినెస్ మలుపు తిప్పిన క్షణం
చిను ఫ్యాషన్ జువెలరీ బిజినెస్ పై నమ్మకం కుదరడంతో ఆమెకు బయటి నుంచి 1.5 కోటి రూపాయల పెట్టుబడి సహాయం అందింది. దాంతో చిను ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన ఫ్యాషన్ జువెలరి బిజినెస్‌ని మరింత విస్తరించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో 29.7 కోట్ల విలువైన అమ్మకాలు సాగించిన రుబాన్స్ బ్రాండ్.. 2022 ఆర్థిక సంవత్సరంలో 51 కోట్ల అమ్మకాలకు బిజినెస్ పెరిగింది. కోట్లలో లాభాలు చవిచూస్తూ రూ. 100 కోట్ల విలువైన ఫ్యాషన్ జువెలరి బ్రాండ్‌కి యజమానిగా ఎదిగింది. సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పడానికి చిను కళ సక్సెస్ స్టోరీనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా..

ఇది కూడా చదవండి : Side Effects of Maggi: మ్యాగీ తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌లో ప్రాణాంతకమైన జబ్బు ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News