Samsung Mobile on Rent: అద్దెకు ఫోన్ కావాలా? శాంసంగ్ ఫోన్స్ రెడీ! మీరు రెడియా?

Samsung Mobile on Rent | శాంసంగ్ మొబైల్స్ ఇక అద్దెపై కూడా లభించనున్నాయి.  

Last Updated : Dec 13, 2020, 04:52 PM IST
    1. మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఖర్చు చేస్తారు.
    2. ఇలా కొనగానే ఆరు నెలల్లోనే మరో మొబైల్ కావాలి అనుకుంటున్నారు.
    3. మొబైల్ వినియోగదారులకు కొత్త కొత్త ఆప్షన్స్ కోసం వెతుకుతుంటారు.
Samsung Mobile on Rent: అద్దెకు ఫోన్ కావాలా? శాంసంగ్ ఫోన్స్ రెడీ! మీరు రెడియా?

Smartphone Rental Program | మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఖర్చు చేస్తారు. ఇలా కొనగానే ఆరు నెలల్లోనే మరో మొబైల్ కావాలి అనుకుంటున్నారు. మొబైల్ వినియోగదారులకు కొత్త కొత్త ఆప్షన్స్ కోసం వెతుకుతుంటారు. ఇలాంటి వారి కోసం శాంసంగ్ మంచి ఆఫర్ తీసుకువచ్చింది. అద్దెపై మొబైల్ ఫోన్స్ అందించడం మొదలుపెట్టింది శాంసంగ్.

Also Read | WhatsApp కొత్త నియమాలను పాటించపోతే ఎకౌంట్ డిలీట్ అవ్వవచ్చు

ఇకపై మీరు మొబైల్స్ మార్చకుండా అద్దెకు తీసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఇతర సర్కిల్స్‌తో కాస్త షోఅప్ చేసుకోవచ్చు. లేదా మీ అవసరాన్ని బట్టి మొబైల్ మార్చుకోవచ్చు. అయితే ఈ రెంటెడ్ మొబైల్సె కోసం మీరు భారీగా డబ్బు వదులుకోవాల్సిన అవసరం కూడా లేదు. 

ప్రస్తుతం ఈ సేవలు జర్మనీలో (Germany) అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా గేలెక్సీ ఫోన్స్ అంటే గేలెక్సీ వన్/టూ/త్రీ మొబైల్స్ 12 నెలల కోసం రెంటుపై అందిస్తారు.  ఈ మేరకు తమ బ్లాగులో వివరాలు అందించిన శాంసంగ్ (Samsung) మొబైల్స్... అద్దెకు తీసుకోవాలి అనుకుంటున్న వినియోగదారులు శాంసంగ్ స్టోర్‌లోకి వెళ్లి ఎస్20 మోడల్ ఎంచుకోవచ్చు అని తెలిపింది. వీటితో పాటు మరిన్ని అప్షన్స్ కూడా చూసుకోవచ్చు.

Also Read | 2021 జనవరి నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూల్స్‌లో మార్పు, పూర్తి వివరాలు చదవండి!

128 జీబీ స్టోరేజీతో పాటు గేలెక్సీ ఎస్ 20, ఎఫ్పై 29 నుంచి 59 యూరో వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ సమయం రెండుపై ఫోన్ తీసుకుంటారో.. అంత తక్కువ చార్జీలు వసూలు చేస్తారు. అయితే ఇది భారత దేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసుకోవాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News