Snakes Viral Videos: పాముల మధ్యే పడుకున్న చిన్నారి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Little Girl Sleeping With Snakes: సోషల్ మీడియాలో నిత్యం మనకు ఎన్నో వైరల్ వీడియోలు దర్శనం ఇస్తుంటాయి. అందులో కొన్ని ఆలోచింప చేసేవి ఉంటే.. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంటాయి. ఇప్పుడు ఈ చిన్నారి పాములతో కలిసి నిద్రిస్తున్న వీడియో కూడా అలా రెండో కోవకు చెందినదే అనిపిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 3, 2023, 06:45 PM IST
Snakes Viral Videos: పాముల మధ్యే పడుకున్న చిన్నారి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Little Girl Sleeping With Snakes: పాములు అంటే ఎవరికైనా భయమే. ఏ వయస్సు వారు అయినా పాములు అంటే హడలెత్తిపోతారు. పాములను పట్టే ధైర్యం ఉన్న వాళ్లు... లేదా పాములకు హానీ తలపెట్టి అయినా సరే తమని తాము కాపాడుకునే వాళ్లు తప్పితే ఇంకెవ్వరయినా పాములను చూడగానే ఆమడ దూరం పరుగెడుతుంటారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఇదే సర్వ సాధారణంగా కనిపించే టెండెన్సీ. ఎందుకంటే పాములు అంటే ఎవ్వరికైనా సేమ్ ఫీలింగ్ ఉంటుంది. పాములను ఇష్టపడే వారు వాటిని ప్రేమిస్తారు.. పాములను చూస్తే భయపడే వారు దూరంగా పరుగెత్తుతుంటారు. 

పాములను చూస్తే పెద్ద వాళ్లే అండ భయపడిపోతే.. ఇక చిన్న పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేం కాదు. చిన్న వయస్సు పిల్లలకు పాములు అంటే ఇంకా ఎక్కువ హడలిపోతుంటారు. అవి పాకే తీరు.. బుసలు కొట్టే తీరు .. వాటి శరీర ఆకృతి, రంగు.. ఇలా ఏ విధంగా చూసినా పాములు పిల్లలనే కాదు... పెద్దలను కూడా భయపెడుతుంటాయి. 

కానీ ఇదిగో ఇక్కడ ఓ వీడియో ఉంది చూడండి. ఇక్కడ ఓ చిన్నారి పాముల మధ్యే సోఫాపై సేద తీరుతోంది. ఎవ్వరైనా కుక్క పిల్లలతో ఆడుకుంటారు.. లేదంటే పిల్లులతో ఆడుకుంటారు.. కానీ ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ చిన్నారి మాత్రం పాములు అంటే తనకు ఏ మాత్రం భయం లేదు సరికదా.. పైగా అవి తన స్నేహితులు అన్నట్టుగా వాటితో ఆడుతూ, వాటి మధ్యే నిద్రిస్తోంది చూడండి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ariana (@snakemasterexotics)

 

సోషల్ మీడియాలో నిత్యం మనకు ఎన్నో వైరల్ వీడియోలు దర్శనం ఇస్తుంటాయి. అందులో కొన్ని ఆలోచింప చేసేవి ఉంటే.. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంటాయి. ఇప్పుడు ఈ చిన్నారి పాములతో కలిసి నిద్రిస్తున్న వీడియో కూడా అలా రెండో కోవకు చెందినదే అనిపిస్తోంది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు అరియానా. ఈమె వీడియోకు ఇప్పటికే రెండున్నర లక్షలకుపైగా వ్యూస్ రాగా.. దాదాపు 65 వేల మంది లైక్ చేశారు.

ఇది కూడా చదవండి : Snake Viral Video: కోపంలో తనను తానే కాటు వేసుకున్న పాము.. భయంకరమైన వీడియో చూశారా..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది జనం ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతుండగా.. ఇంకొంతమంది నెటిజెన్స్ ఆ చిన్నారికి ఏమైనా అవుతుందేమో అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ వీడియోలకు వ్యూస్ కోసం లేదా లైక్స్ కోసం చిన్న పిల్లలను, విష సర్పాలను ఇలా ఒక్క చోట పెట్టి ఇలాంటి దుస్సాహాసాలు చేయొద్దు అని హితవు పలుకుతున్నారు. అందులోనూ మరీ ఇంత భయంకరంగా పాముల మధ్య చిన్నారిని పడుకోబెట్టి వీడియోలు తీయడం ఏంటని ఇంకొంతమంది నెటిజెన్స్ మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి : Viral Snakes Videos: ఆదమరిచి డాన్స్ చేస్తోన్న 2 పెద్ద నాగు పాములు.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News