Snake In Cauliflower: కాలీఫ్లవర్‌‌లో పాము.. ఒళ్లు జలదరించే షాకింగ్ వీడియో

Snake In Cauliflower: ఒక కుటుంబం కూరగాయల మార్కెట్‌లో కాలీఫ్లవర్‌ కొనుగోలు చేసుకుని ఇంటికి వచ్చింది. ఆ కాలీఫ్లవర్ కదులుతున్నట్టుగా అనిపించి అనుమానంతో అందులో ఏమైనా ఉందా అని ఆ వ్యక్తి ఆ కాలీఫ్లవర్‌ని చేతిలోకి తీసుకుని చూసి షాకైంది. తనకు కనపడిన ఆ దృశ్యం చూసి అతడు ఉలిక్కిపడ్డాడు. 

Written by - Pavan | Last Updated : Aug 15, 2023, 06:49 PM IST
Snake In Cauliflower: కాలీఫ్లవర్‌‌లో పాము.. ఒళ్లు జలదరించే షాకింగ్ వీడియో

Snake In Cauliflower: వర్షాకాలంలో కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. మరీ ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్స్ కొనేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించకుండా అస్సలే కొనవద్దు. ఎందుకంటే మీరు కొనే కూరగాయల్లో మీకే తెలియకుండా ఏదైనా విష ప్రాణులు మీ వెంట రావచ్చు. కూరగాయలు కొంటే పాములు ఫ్రీ లేదా తేళ్లు ఫ్రీ అన్నట్టుగా కూరగాయలతో పాటే ఏవైనా విష ప్రాణులు కూడా మీ వెంటే రావొచ్చు. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయినా కూరగాయల్లో పాములు, తేళ్లు ఎలా ఉంటాయి.. ఇదంతా ఉత్తి ట్రాష్ అని కొట్టిపారేస్తున్నారా ? అయితే మీరు కచ్చితంగా ఈ వీడియో చూసి తీరాల్సిందే. 

ఒక కుటుంబం కూరగాయల మార్కెట్‌లో కాలీఫ్లవర్‌ కొనుగోలు చేసుకుని ఇంటికి వచ్చింది. ఆ కాలీఫ్లవర్ కదులుతున్నట్టుగా అనిపించి అనుమానంతో అందులో ఏమైనా ఉందా అని ఆ వ్యక్తి ఆ కాలీఫ్లవర్‌ని చేతిలోకి తీసుకుని చూసి షాకైంది. తనకు కనపడిన ఆ దృశ్యం చూసి అతడు ఉలిక్కిపడ్డాడు. ఆ కుటుంబం మొత్తం ఆ సీన్ చూసి ఒక్కసారిగా షాకైంది. ఎందుకంటే అందులో ఒక చిన్న పాము పిల్ల పాకుతూ కనిపించింది. చూడ్డానికి ఆ పాము ఒక కట్ల పామును పోలి ఉంది.

ఆ పామును బయటికి తీసే ప్రయత్నంలో అతడు ఆ కాలీ ఫ్లవర్ కొమ్మలని విరిచేస్తున్నా కొద్ది ఆ పాము ఒకదాంట్లోంచి మరొదాంట్లోకి పాకుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో చూడొచ్చు.

దేవేంద్ర షైనీ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజెన్స్ నుండి విపరీతమైన స్పందన కనిపిస్తోంది. చాలామంది నెటిజెన్స్ ఈ వీడియో చూసి భయబ్రాంతులకు గురైనట్టుగా కామెంట్స్ పెడుతున్నారు. 

ఇది కూడా చదవండి : Cats Vs Snakes Fighting Videos: పిల్లులకు, పాములకు ఫైటింగ్ జరిగితే ఏది గెలుస్తుంది ?

ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనే వివరాలను దేవేంద్ర షైనీ పేర్కొనలేదు. కాకపోతే ఇదేం కాలీఫ్లవర్ అనుకోవాలి ? ఇది కోబ్రా కాలీఫ్లవరా లేక వైపర్ కాలీ ఫ్లవరా అంటూ తన సందేహాన్ని వ్యక్తపరుస్తున్నట్టుగా వీడియోపై క్యాప్షన్ రాసుకొచ్చాడు. 

మొత్తానికి ఈ వీడియో వీక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. మనం ఆరోగ్యం కోసం తినే కూరగాయల్లో ఇలా పాములు, జెర్రిలు లేదా తేళ్లు ఇంటికి వస్తే మన పరిస్థితి ఏంటి ? అనే ఊహే వారికి ఒళ్లు జలదరించేలా చేస్తోంది.

ఇది కూడా చదవండి : College Building Collapsed: భారీ వర్షాలకు పేక మేడలా కుప్పకూలిన డిఫెన్స్ కాలేజ్ బిల్డింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News